Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధరలు: వరుసగా ఆరో మంత్ లాస్

ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు వరుసగా మూడో రోజు పడిపోయాయి. శుక్రవారం నాడు రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,300కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, యూఎస్ ఫెడ్ సమావేశం, డాలర్ విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి.

దీంతో పాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కూడా లేదు. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.175 తగ్గింది. శుక్రవారం వరుసగా మూడో రోజు రూ.250కి తగ్గింది. ఈ రోజు తగ్గుదలతో ఆరు వారాల కంటే తక్కువకు పడిపోయింది.

Gold prices hit six week low, set for longest monthly losing streak in 20 years

సెప్టెంబర్ నెలలో బంగారం 1.6% శాతం పడిపోయింది. వరుసగా ఆరో నెల నష్టపోవడం ఇదే మొదటిసారి. 1997 తర్వాత, అంటే గత 20 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా వరుస నెలలు నష్టపోతోంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పడిపోయింది.

మరోవైపు, వెండి కూడా తగ్గింది. వెండి భారీగా తగ్గి రూ.38వేల మార్క్‌కు చేరుకుంది. రూ.450 తగ్గడంతో కిలో వెండి రూ.38,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేదు. దీంతో వెండి ధర భారీగా తగ్గింది. గురువారం వెండి ధర రూ.300 తగ్గింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+