Gold Price Today: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఎంత పెరిగిందంటే?

బంగారం... ఈ పేరు వింటేనే భారతీయులకు ఎంతో ఉత్సాహం, ఆసక్తి. తరతరాలుగా ఇది కేవలం ఆభరణంగానే కాకుండా, సంపదకు, భద్రతకు చిహ్నంగా నిలుస్తోంది. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అలాంటి బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్నాయి. మరి, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల సరళి ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం..

పడిసి ధరలు రోజు రోజుకు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ రోజు ఏకంగా 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు రూ. 40 పెరిగింది. 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.44 లకు పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.8,984 ఉండగా, 22 క్యారెట్ల గ్రాముల ధర రూ.8,235 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,350 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

gold-prices-in-hyderabad-vijayawada-mumbai-and-delhi-today-s-update

ఢిల్లీ, ముంబైలో గోల్డ్ ధరలు ఇలా..
దేశ రాజధానిలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 8,211, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 8,956 గా ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో కీలక మార్కెట్‌ను సూచిస్తుంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,235, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,984 గా ఉంది. పుణేలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,235, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,984 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,235, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,984లకు చేరింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,240, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,989 గా ఉంది.

హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,235, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,984 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,235, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,984 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,196, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,941 గా ఉంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు దాదాపుగా ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ, నగరాలను బట్టి స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్ మరియు సరఫరా వంటి అంశాలు ఈ వ్యత్యాసాలకు కారణమవుతాయి.

మొత్తం మీద బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది బంగారం యొక్క స్థిరమైన, నమ్మకమైన ఆస్తి అనే హోదాను మరింత బలపరుస్తోంది. బంగారం దాని మన్నికకు (Durability) ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా తుప్పు పట్టదు, దాని మెరుపు తగ్గదు. అందుకే తరతరాలుగా ఆభరణాలుగా, పెట్టుబడిగా దీనిని భద్రపరుచుకుంటారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+