ఆదివారం బంగారం ధరలు ఇవే..రూ.2000 తగ్గింపు
ఆగస్టు 3, ఆదివారం నాటికి బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరువయ్యాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,620 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,300 పలికింది. కేజీ వెండి ధర రూ. 1,23,000 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో ఉన్న పసిడి ధరతో పోలిస్తే ప్రస్తుతం రూ. 2000 మాత్రమే తక్కువగా ఉంది. ఈ అనూహ్య పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నష్టాల నేపథ్యంలో, సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై మాంద్యం నీడలు, డాలర్ విలువ పతనం బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అమెరికా విధించిన సుంకాల వల్ల వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఇది డాలర్ విలువను మరింత తగ్గించి, బంగారం ధరను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశీయ మార్కెట్లలో కూడా పసిడి ఆభరణాల ధరలు భారీగా పెరగడంతో, శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఇది ఆర్థిక భారాన్ని మోపుతోంది. వెండి ధర కూడా ఆల్ టైం రికార్డు స్థాయికి చేరువలో ఉన్నప్పటికీ, బంగారం కంటే స్వల్పంగా తక్కువగా ఉంది. భవిష్యత్తులో వెండి ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications