Gold Rate Today : బంగారం కొనాలనుకుంటున్నారా? ముందు ఇవాళ రేటు చూసేయండి!

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు.. ఇలా ఏ వేడుకైనా బంగారం లేకుండా జరగని రోజులివి. బంగారం కొనాలన్నా, కాస్త పెట్టుబడి పెట్టాలన్నా సామాన్యుడు జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. గత మూడు రోజుల్లోనే గ్రాముకు ఏకంగా రూ. 600 మేర పెరగడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడానికి కారణాలేంటో అర్థం కాక సగటు మనిషి సతమతమవుతున్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చలు జరుగుతున్నాయి.

బంగారం.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పగ్గాలు తెగిన గుర్రంలా పరుగులు పెడుతూ సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఓ మోస్తరుగా ఉన్న ధరలు, ఇప్పుడు భగ్గుమంటూ మంటలు రేపుతున్నాయి. ఈ పెరుగుదల తాకిడితో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

gold-rates-soar-again-check-today-s-24-carat-gold-price

హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ దరలు:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు మండిపోతున్నాయి. మిగతా నగరాల పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. ప్రతి నగరంలోనూ ధరలు కొండెక్కుతున్నాయి. నగలంటే మక్కువ చూపే హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,560 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,770 వద్ద ఉంది.
వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు కొనాలంటే రూ.9,567 చెల్లించాల్సిందే. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,770గా ఉంది. తీర ప్రాంత నగరం విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,567 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,770 వద్ద కొనసాగుతోంది.

నిన్నటి ధరలతో పోల్చితే ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు రూ. 25 పెరగ్గా.. 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 27 చేరింది. ఇది పదిగ్రాములకు రూ. 270 , అదే 100 గ్రాములకు రూ.2,700 మేరకు పెరిగింది.

ఢిల్లి, బెంగళూరులో ధరలు:
దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,582 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,785 గాను ఉంది. చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్కతా, మైసూరు, ముంబై, కేరళ నగరాల్లో కూడా ధరలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,567 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,770 గాను నమోదైంది. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,570 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,775 గా ఉంది. ఇక్కడ నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ. 25 పెరిగింది.

నిన్నటితో పోలిస్తే పెరుగుదల:
నిన్నటి ధరలతో పోల్చితే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 25 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 27 మేర పెరిగింది. ఈ స్వల్ప పెరుగుదల కూడా సామాన్యుడికి భారంగానే మారుతోంది.

వెండి కూడా వెండి వెలగదులుతోంది!
బంగారమే కాదు వెండి ధరలు కూడా రోజురోజుకు పెరుగుతూ సామాన్యుడికి మరింత భారం పెంచుతున్నాయి. వెండి గ్రాముకు రూ. 2 పెరిగి ఏకంగా రూ. 110 కి చేరింది. కేజీ వెండి ధర అయితే ఏకంగా రెండు వేలు పెరిగి లక్షా 10 వేలకు ఎగబాకింది. వెండి ధరలు కూడా ఇలాగే పెరిగితే సామాన్యుడు వెండి వస్తువులు కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.

మొత్తం మీద బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో, మళ్లీ కొనుగోలు చేసే రోజులు ఎప్పుడొస్తాయో అని ఎదురుచూస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం కొనాలనుకునే మధ్యతరగతి, పేద కుటుంబాలు మరింత కలవరపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+