బంగారం ధరల్లో కొత్త చరిత్ర..!!

బంగారం ధరలు తగ్గట్లేదు. ఏ ఒక్క రోజు కూడా అవి తగ్గే సూచనలు కనిపించట్లేదు. వెండిదీ ఇదే పరిస్థితి. పసిడి- వెండి రేట్లు పైపైకి దూసుకెళ్తున్నాయి. ఈ దూకుడు నేడు కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 5,500 డాలర్లను దాటిపోయింది. దీని ప్రభావం దేశీయ బంగారం అమ్మకాలపై పడింది. పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల నుంచి పెరిగిన డిమాండ్, ఆర్థిక అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ ఒకశాతం పెరిగి, రూ. 1,70,000లను తాకింది. వెండి ఫ్యూచర్స్ 5.62 శాతం ఎగిసింది, కిలో రూ. 3,96,300లకు చేరింది. కామెక్స్ లో బంగారం రెండు శాతానికి పైగా వృద్ధితో ఔన్స్‌కు 5,227.50, వెండి 8.52 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 114.99 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

Gold Rates Surges to New All-Time Highs in India with MCX and COMEX Amid Global Trade conditions

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 17,030, 22 క్యారెట్లు - రూ. 15,611, 18 క్యారెట్లు - రూ. 13,026

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,709, 22 క్యారెట్లు- రూ. 15,316, 18 క్యారెట్లు - రూ. 12,532

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,709, 22 క్యారెట్లు- రూ. 15,316, 18 క్యారెట్లు- రూ. 12,532

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,709, 22 క్యారెట్లు- రూ. 15,316, 18 క్యారెట్లు- రూ. 12,532

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,709, 22 క్యారెట్లు- రూ. 15,316, 18 క్యారెట్లు- రూ. 12,532

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,709, 22 క్యారెట్లు- రూ. 15,316, 18 క్యారెట్లు- రూ. 12,532

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+