నెలనెలా క్షీణిస్తోన్న జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో కనిష్టస్థాయికి!

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా రెండో నెల నవంబర్‌లోనూ తగ్గాయి. రూ.80,808 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వసూళ్లలో ఇదే కనిష్టస్థాయి.

అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.83,000 కోట్లు కాగా, నవంబర్‌లో ఇవి రూ. 80,808 కోట్లకు చేరాయి. జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లు.

GST revenue slips further, Rs.80,808 crore tax collected for November

ఇక నవంబర్‌ వసూళ్లు రూ.80,808 కోట్లలో... రూ. 7,798 కోట్లు కాంపెన్సేషన్ సెస్‌గా వసూలయ్యాయి. రూ.13,089 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీకాగా.. రూ.18,650 కోట్లు రాష్ట్ర జీఎస్‌టీ. రూ.41,270 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ జీఎస్‌టీ.

జీఎస్టీ క్షీణతకు ప్రధాన కారణం.. కొత్త జాతీయ అమ్మకపు పన్ను విధానాన్ని మరింత ఆమోదయోగ్యంగా మలచడంలో భాగంగా కొన్ని వస్తువులపై రేట్లు తగ్గించడమే. తాజా వసూళ్లపై ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారమే ఈ గణాంకాలు విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+