ట్రంప్‌కు వార్నింగ్! మళ్ళీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
ప్రపంచ ఇంధన సరఫరాకు 'జీవనాడి' లాంటి హోర్ముజ్ జలసంధిలో అలజడి మొదలైంది. ఇక్కడ రవాణాకు ఏమాత్రం అంతరాయం కలిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని చమురు రంగ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక ప్రకారం, ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్, కోనోకోఫిలిప్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు వైట్‌హౌస్ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
కేవలం కొన్ని రోజుల్లోనే తాజాగా సెంచరీ కొట్టేసింది. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు 106 డాలర్ల మేర పెరిగింది. అదే సమయంలో యూఎస్ ఆయిల్ 2.6 శాతం పెరిగి 101 డాలర్ల వద్ద ఉంది. మార్కెట్ వర్గాలను వణికించింది. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోతే, రోజుకు దాదాపు 10 మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోతుంది. అమెరికా తన దేశీయ ఉత్పత్తిని పెంచినా, ఈ భారీ లోటును భర్తీ చేయడం అసాధ్యమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సరఫరా తగ్గితే చమురు ధరలు ఊహకందని స్థాయికి పెరిగే అవకాశం ఉందని ఎక్సాన్ సీఈఓ డారెన్ వుడ్స్ హెచ్చరించారు.

Trump మాస్టర్ ప్లాన్: 'మీ చమురు.. మీరే కాపాడుకోండి!'
ఈ సంక్షోభంపై అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టమైన, పటిష్టమైన వైఖరిని తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురులో అమెరికాకు వచ్చేది కేవలం 1 శాతం మాత్రమేనని, చైనా వంటి దేశాలు తమ అవసరాల కోసం 90 శాతం వరకు దీనిపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. "ఏ దేశాలైతే ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయో, అవే ముందుకు వచ్చి తమ నౌకలకు భద్రత కల్పించుకోవాలి" అని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇందుకోసం సుమారు ఏడు దేశాలతో కూడిన అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రపంచానికి ఎందుకు భయం?
హోర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ తీరాన్ని ఒమన్ నుండి వేరు చేసే ఒక ఇరుకైన జలమార్గం. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు వాణిజ్యంలో నాలుగో వంతు, అలాగే ద్రవీకృత సహజ వాయువు (LNG)లో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇక్కడ ఒక్క రోజు అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా రవాణా ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
ప్రస్తుతానికి ఏ దేశం కూడా భద్రతా మిషన్‌కు పూర్తిస్థాయి హామీ ఇవ్వలేదు. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగి ఈ జలసంధి మూతపడితే.. ప్రపంచం చీకట్లోకి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications