మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ కొత్త చీఫ్ డైవర్శిటీ ఆఫీసర్‌పై ఐబిఎం కేసు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ కొత్త చీఫ్ డైవర్శిటీ ఆఫీసర్ లిండ్సే రే మెక్ ఇంటైర్‌పై, ఐబీఎం కేసు వేసింది. తమ మధ్య ఉన్న ఒప్పందాలను ఆయన ఉల్లంఘించారని ఐబీఎం ఆరోపిస్తుంంది.

లిండ్సే-రే అంతకముందు ఐబీఎంలో హెచ్‌ఆర్‌ అధినేతగా పనిచేశారు. ఐబీఎం నుంచి అకస్మాత్తుగా రాజీనామా చేసిన లిండ్సే, కంపెనీకి సంబంధించి ఎంతో కీలకమైన, రహస్య సమాచారం కలిగి ఉన్నారని పేర్కొంది.

IBM sues former HR boss hired by Microsoft

ఐబీఎం డైవర్సిటీ స్ట్రాటజీస్‌, హైరింగ్‌ టార్గెట్స్‌, టెక్నాలజీస్‌, ఇన్నోవేషన్స్‌ వంటి సమాచారమంతా ఆమె వద్ద ఉందని న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలు చేసింది.

అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్‌ ఇంకా స్పందించలేదు. తాత్కాలికంగా లిండ్సేను మైక్రోసాఫ్ట్‌కు వెళ్లకుండా జడ్జి నిషేధం విధించారు. లిండ్సే లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం ఆమె ఇంకా ఐబీఎంకి హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ డైవర్సిటీ ఆఫీసర్‌గానే పనిచేస్తున్నట్టు ఉంది.

ఆమె తమ ఏడాది ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐబీఎం తెలిపింది.అయితే లిండ్సే వద్దనున్న ట్రేడ్‌ సీక్రెట్లు మైక్రోసాఫ్ట్‌కు అంత అవసరమైనవి కావని, తన కొత్త బాధ్యతల్లో వీటిని ఉపయోగించే అవకాశం లేదని ఆమె లాయర్లు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
International Business Machines Corp sued its former executive Lindsay-Rae McIntyre, who was named Microsoft Corp's new chief diversity officer over the weekend, alleging violation of a one-year non-competitive agreement.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి