డిసెంబర్ 3న బ్యాంకులు బంద్? ఐడీబీఐ ఉద్యోగుల హెచ్చరిక!

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కెనడాకు చెందిన ప్రముఖ ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) మెజారిటీ వాటాలను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ డీల్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఇందులో భాగంగా రాబోయే డిసెంబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె నిర్వహించనున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగ, అధికారుల సంఘాలు అధికారికంగా ప్రకటించాయి. గత రెండు నెలల్లో ఇలాంటి ఆందోళన జరగడం ఇది రెండోసారి కావడం విశేషం.

IDBI Bank Unions Call Nationwide Strike on December 3 Against Rs 53 000-Crore Fairfax Takeover Deal

రూ. 52,878 కోట్ల ఫెయిర్‌ఫాక్స్ డీల్.. అసలు వివాదం ఏంటి?

కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమ్ వాత్సా నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాలను విక్రయించేందుకు ఇటీవల ఒప్పందం కుదిరింది. సుమారు రూ. 52,878 కోట్ల విలువైన ఈ భారీ ఒప్పందం భారత ఆర్థిక సేవల రంగంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుంది. అయితే, దేశంలోని ప్రతిష్టాత్మక పబ్లిక్ సెక్టార్ బ్యాంకును విదేశీ సంస్థ చేతుల్లోకి మార్చడం ద్వారా దాని ప్రభుత్వ రంగ హోదా కోల్పోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 19 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఈ బ్యాంకును ప్రైవేటీకరించడాన్ని తాము సహించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు.

మళ్ళీ బ్యాంకుల విలీనం! ఆ 4 బ్యాంకుల్లో వాటాలు తగ్గింపునకు కేంద్రం కసరత్తు
మళ్ళీ బ్యాంకుల విలీనం! ఆ 4 బ్యాంకుల్లో వాటాలు తగ్గింపునకు కేంద్రం కసరత్తు

ఆర్‌బీఐకి ఉద్యోగుల విజ్ఞప్తి.. డీల్‌ను నిలిపివేయాలని డిమాండ్

ఈ వివాదాస్పద ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరుతూ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరం నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. ఫెయిర్‌ఫాక్స్ సంస్థ బ్యాంకింగ్ అనుభవం, డీల్ వాల్యుయేషన్, నిధుల మూలాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా, ఇప్పటికే ఆ సంస్థకు మరో బ్యాంకులో వాటాలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆర్‌బీఐ ఈ లావాదేవీకి ఎలాంటి అనుమతులు మంజూరు చేయకూడదని డిమాండ్ చేశారు.

Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!
Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!

మరోవైపు ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. బ్యాంకు ప్రైవేటీకరణ జరిగినా ప్రస్తుత ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పెన్షన్ ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు ఉండదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అయితే ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందని సంఘాలు మాత్రం తమ పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పాయి. డిసెంబర్ 3 సమ్మె ద్వారా ప్రభుత్వ వైఖరి మారకపోతే భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+