LPG prices: బడ్జెట్ కు ముందే గ్యాస్ సిలెండర్ల ధరలపై గుడ్ న్యూస్? రీజన్ ఇదే..!
పార్లమెంట్ లో ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన అంటే ఎల్లుండి వరుసగా తొమ్మిదో బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో గతేడాది జీఎస్టీ సంస్కరణల తరహాలోనే పలు ఊరటలు లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వేతన జీవుల నుంచి వ్యాపారవేత్తల వరకూ ప్రతీ ఒక్కరూ ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహిణులకు మరో గుడ్ న్యూస్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎల్లుండి గ్యాస్ ధరల సమీక్ష
మన దేశంలో ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలెండర్ల ( LPG ) ధరల్ని చమురు కంపెనీలు సవరిస్తూ వస్తున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరి 1న కూడా గ్యాస్ ధరలపై సమీక్ష ఉంటుంది. అది కూడా ఉదయం 6 గంటలకే దీనిపై చమురు కంపెనీలు తమ నిర్ణయం ప్రకటిస్తాయి.అంటే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టక ముందే ఈ ప్రకటన వస్తుంది. ఇందులో చమురు కంపెనీలు ఈసారి గ్యాస్ ధరల్ని తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ పరిణామాలు ఆశలు రేపుతున్నాయి.

LPG గ్యాస్ ధరలు తగ్గే ఛాన్స్
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ తీవ్ర ఒడిడొదుకులకు లోనవుతోంది. ఇందులో చమురు ధరలతో పాటు బంగారం, వెండి వంటి లోహాల ధరలు కూడా తీవ్ర కుదుపులకు లోనవువుతున్నాయి. తాజాగా బంగారం ధర గంటల వ్యవధిలో లక్షల కోట్ల మేర పతనమైంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి మరోసారి బయటపడింది. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. మరోవైపు తమ పొరుగునే ఉన్న అంతర్జాతీయ చమురు సరఫరా జలసంధి హార్ముజ్ ను మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇవన్నీ కలిసి గ్యాస్ ధరలు తగ్గుతాయని సామాన్యులు గంపెడాశలు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications