RBI: ఓటీపీ షేర్ చేసి మోసపోయారా ? అయినా మీకు 25 వేలు..!
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ మోసాలే. బ్యాంక్ అకౌంట్, సోషల్ మీడియా వాడుతుంటే చాలు ఏదో విధంగా మోసం చేయొచ్చనే ధైర్యంతో సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టుల పేరుతో చేస్తున్న మోసాలకు అంతే లేకుండా పోతోంది. ఇన్నాళ్లూ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండిపోతున్న రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పుడు ఆలస్యంగా అయినా కళ్లు తెరిచింది. డిజిటల్ మోసాల బాధితులకు కనీస పరిహారం అయినా ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
డిజిటల్ మోసాలకు 25 వేల పరిహారం
ఇందులో భాగంగా డిజిటల్ మోసాల బారిన పడిన బాధితులకు గరిష్టంగా 25 వేల వరకూ పరిహారం ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. మోసం జరిగిన స్థాయిని బట్టి గరిష్టంగా 25 వేల వరకూ పరిహారం అందించేలా నిబంధనల్ని సిద్దం చేస్తోంది. డిజిటల్ మోసాలకు గురైన బ్యాంక్ ఖాతా దారులు తమ బ్యాంకుల్ని ఆశ్రయించి తగిన ఆధారాలు సమర్పిస్తే వారికి ఈ పరిహారం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో తొలుత బ్యాంక్ ఖాతాదారులు తమకు సంబంధం లేకుండా మోసపోతేనే ఈ పరిహారం అందించాలని నిర్ణయించింది. కానీ ఇప్పుడు మరో మార్పు చేసింది.

ఓటీపీ షేర్ చేసినా 25 వేల వరకూ..
డిజిటల్ మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు, రోబో కాల్స్ వచ్చినప్పుడు ఓటీపీలు షేర్ చేయడం ద్వారా మోసపోయిన వారికి కూడా ఇలా గరిష్టంగా 25 వేల రూపాయల వరకూ పరిహారం ఇచ్చేందుకు ఆర్బీఐ సిద్దమవుతోంది. తద్వారా ఉద్దేశపూర్వకంగా ఓటీపీలు షేర్ చేసిన వారికి కూడా ప్రయోజనం చేకూరబోతోంది. వాస్తవానికి చిన్న మొత్తంలో మోసాలకు గురైన వారికి 25 వేలు లేదా నష్టపోయిన మొత్తంలో 85 శాతం పరిహారంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఎవరి బాధ్యత ఎంత ?
మన దేశంలో దాదాపు 65 శాతం మోసాలు రూ.50,000 కంటే తక్కువ మొత్తంలో జరుగుతున్నట్లు ఆర్బీఐ తేల్చింది. అందుకే ఇప్పుడు అలాంటి వారిని టార్గెట్ చేసుకుని ఈ పరిహారం నిబంధన తీసుకొస్తోంది. అలాగే ఇలాంటి మోసాల వల్ల డబ్బు కోల్పోయిన వారికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందిస్తారు. ఆర్బీఐ నష్టం మొత్తంలో 70 శాతం పరిహారం ఇస్తుందని, మిగిలిన 30 శాతం కస్టమర్, బ్యాంకు భరించాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో వచ్చే మిగులు ఆదాయం నుండి ఈ చెల్లింపులు చేస్తామని ఆర్బీఐ తెలిపింది.

ప్రజాభిప్రాయ సేకరణ
తాజా రూల్స్ పై ప్రజాభిప్రాయ సేకరణ కోసం 3 ప్రత్యేక ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మొదటిది ఆర్థిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చేసేది, రెండవది రుణాలు తీసుకున్నవారిని వేధించడం, అన్యాయంగా వ్యవహరించకుండా నిరోధించడానికి, మూడోది అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కస్టమర్ బాధ్యతను పరిమితం చేయడంపై ఉన్నాయి. ఈ నిబంధనలు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతాయని, సురక్షితమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ పద్ధతులను కల్పిస్తాయని భావిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications