PM Kisan: పీఎం కిసాన్ మొత్తాన్ని రూ.12 వేల పెంచాలని డిమాండ్..!

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఉన్నారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. అయితే ఆరేళ్లు కావస్తున్నా.. రైతులకు ఇచ్చే మొత్తాన్ని పెంచలేదు. వచ్చే సంవత్సరం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు.

ఈ రాబోయే బడ్జెట్‌కు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు సన్నాహక సమావేశాలకు అధ్యక్షత వహించారు. డిసెంబర్ 7, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, రైతు సంస్థలతో సమావేశమయ్యారు. ప్రీ-బడ్జెట్ సమావేశంలో రైతు సంఘాల సూచనలు, ప్రతిపాదనలు తెలుసుకున్నారు. 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు, సవాళ్లపై ఆర్థిక మంత్రి విస్తృత సంప్రదింపులు జరిపారు.

Nirmala Sitharaman urged to increase the amount given under the PM Kisan Yojana scheme to Rs 12 000

వ్యవసాయ ఉత్పాదకతను మరింత ముఖ్యమైనదిగా చేయడంతో పాటు రైతుల ప్రయోజనాలను మరింత పెంచే లక్ష్యంతో పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాఖర్ తెలిపారు. రైతు సంఘాలు పలు డిమాండ్లను కేంద్ర మంత్రి ముందు ఉంచారు. PM-కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలనేది రైతు సంఘాల అత్యంత ముఖ్యమైన డిమాండ్లలో ఒకటిగా ఉంది. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రూ.6000 నుంచి రూ.12,000కి పెంచాలని డిమాండ్ చేశారు.

చిన్న రైతులను కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కిందకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. చిన్న రైతులు సున్నా ప్రీమియంతో పంట బీమా పొందే సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు ఇచ్చే రైతు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు. వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు లేదా యంత్రాలు, ఎరువులు లేదా విత్తనాలు, మందులకు GST నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ను ఆర్థిక మంత్రి ముందు ఉంచారు. యూనియన్ బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1, 2025 సమర్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+