అతను బాస్ కాదు భగవంతుడు.. ఒక్కొక్కరికి రూ.3.7 కోట్ల బోనస్!
వ్యాపార ప్రపంచంలో లాభాల కోసం పాకులాడే యజమానులను చూస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యాపారి తన కంపెనీని విక్రయించేటప్పుడు తన ఉద్యోగుల భవిష్యత్తు కోసం పెట్టిన షరతు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన సంస్థ ఎదుగుదలకు కారణమైన సిబ్బందికి భారీ బోనస్ ఇప్పించి ఆయన నిజమైన లీడర్ అని అనిపించుకున్నారు.
ఏమిటా కండీషన్!
అమెరికాలో డేటా సెంటర్ల కోసం పవర్ ఎన్‌క్లోజర్‌లను తయారు చేసే 'ఫైబర్‌బాండ్' కంపెనీని దాని యజమాని గ్రాహం వాకర్ ఇటీవల 'ఈటన్' అనే సంస్థకు విక్రయించారు. ఈ డీల్ విలువ దాదాపు 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు). అయితే, ఈ ఒప్పందంలో వాకర్ ఒక కఠినమైన షరతు పెట్టారు. "కంపెనీ అమ్మకం ద్వారా వచ్చే మొత్తంలో 15 శాతం డబ్బును ఖచ్చితంగా ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వాలి. దీనిపై ఎలాంటి బేరసారాలు ఉండకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈ ఉద్యోగుల వద్ద కంపెనీకి సంబంధించిన ఒక్క షేరు కూడా లేదు.

ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి
ఈ డీల్ ద్వారా కంపెనీలోని 540 మంది పూర్తిస్థాయి ఉద్యోగులకు మొత్తం 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,000 కోట్లు) బోనస్‌గా లభించాయి. ప్రతి ఉద్యోగికి సగటున 4,43,000 డాలర్లు (సుమారు రూ. 3.7 కోట్లు) అందుతున్నాయి. ఈ సొమ్మును రాబోయే ఐదేళ్ల కాలంలో విడతల వారీగా ఉద్యోగులకు అందజేస్తారు.
కంటతడి పెట్టిన సిబ్బంది
జూన్ నెలలో ఉద్యోగులకు తమ బోనస్ వివరాలతో కూడిన సీల్డ్ కవర్లు అందినప్పుడు చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. లేసియా కీ అనే మహిళ 29 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఆమె, 1995లో గంటకు కేవలం 5 డాలర్ల జీతంతో చేరారు. ఆమెకు అందిన బోనస్‌తో తన ఇంటి లోన్ తీర్చివేసి, కొత్తగా బట్టల దుకాణం ప్రారంభించారు. "ఇంతకాలం కేవలం జీతం కోసం బతికాం, ఇప్పుడు మేము స్వేచ్ఛగా జీవించగలం" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న హాంగ్ బ్లాక్‌వెల్ లక్షల డాలర్ల బోనస్ రావడంతో వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి, తన భర్తకు ఇష్టమైన కారును కొనిచ్చారు.
కష్టకాలంలోనూ అండగా..
1982లో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉత్పత్తి ఆగిపోయినా, వాకర్ కుటుంబం ఉద్యోగులకు జీతాలు ఆపలేదు. 2000వ సంవత్సరంలో డాట్-కామ్ సంక్షోభం సమయంలో సిబ్బందిని తగ్గించాల్సి వచ్చినా, మిగిలిన వారిని ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు తన లాభంలో సిబ్బందికి వాటా ఇచ్చారు. వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులను కేవలం పనిముట్లుగా కాకుండా, భాగస్వాములుగా చూస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి గ్రాహం వాకర్ ఒక నిలువెత్తు నిదర్శనం. అడ్వైజర్లు హెచ్చరించినా వినకుండా, తన సిబ్బంది కోసం పట్టుబట్టి ఆయన ఈ బోనస్ ఇప్పించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications