టాప్ సెల్లింగ్ మోడళ్లపై రేట్లు తగ్గించిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తమ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ల కానుకను ప్రకటించేసింది. తన టాప్ సెల్లింగ్ మోడల్ టీవీలపై డిస్కౌంట్‌లను అందిస్తోంది.
వివిధ మోడళ్ల టీవీలపై 5 నుంచి 15శాతం తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తోంది.
ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. 32 - 43 అంగుళాల టీవీలపై రూ. 1,000 నుంచి రూ .2,500 వరకు ఈ తగ్గింపు ఉండనుంది.

75 ఇంచెస్ టీవీలపై రూ45వేల రూపాయల వరకు (15 శాతం) తగ్గింపును అందివ్వనుంది. టిసిఎల్, షావోమి బిపిఎల్, వూ, కోడాక్ మార్కెట్ ప్రత్యర్థులపోటీని అధిగమించేలా ఈ తగ్గింపు ధరలను వెల్లడించినట్లు తెలుస్తోంది..
అంతేగాక, రానున్న పండుగసీజన్‌లో క్యాష్‌బ్యాక్‌లు, ఇతర బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా, శాంసంగ్ తన టెలివిజన్ సెట్లపై రేట్లు తగ్గించడం వరుసగా ఇది రెండవసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications