మల్టీబ్యాగర్ స్టాక్.. సుడి తిరిగింది.. రూ.లక్షకు రూ.1.76 కోట్ల లాభం
స్టాక్ మార్కెట్లు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఏ స్టాక్ లో పెట్టుబడి పెట్టాలో తెలియక, అవగాహన లేక పలువురు ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. తొందరపడి పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటే ముందుగా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ రావాలి. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తుండాలి
అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వస్తేనే కొంతవరకైనా లాభం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి షేరు ఒకటి ఉంది. రూ.10వేల పెట్టుబడిని దీర్ఘకాలంలో రూ.17 లక్షలుగా చేసింది. రూ.లక్ష పెట్టినవారికి రూ.1.76 కోట్లిచ్చింది. ఓపికతో ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. అదే శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్. గత 10 సంవత్సరాల్లో ఈ స్టాక్ 17,600 శాతం రిటర్న్స్ అందించింది.

పదేళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ.10 వేలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతికి రూ.17.6 లక్షలు వచ్చాయి. వీటిని మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ అనవచ్చు. ఇలాంటి రాబడిని ఇస్తుందని పెట్టుబడి పెట్టినవారే ఊహించలేకపోయారు. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినవారికి ఏకంగా కోటీ 76 లక్షల రూపాయలు వచ్చాయి. గత మూడేళ్లలో 2150 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
శివాలిక్ కంపెనీ డిఫ్యూషన్ బాండింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, సోల్డర్ రీఫ్లో, రెసిస్టెన్స్ వెల్డింగ్ వంటి మెథడ్స్‌తో మెటీరియల్ జాయినింగ్ సెక్టార్‌లో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3,200 కోట్లకుపైగా ఉంది. రిటైల్ పెట్టుబడిదారుల వాటా 25 శాతంగా ఉంది.
పబ్లిక్ షేర్‌హోల్డర్లు, మ్యూచువల్ ఫండ్లు, విదేశీ పెట్టుబడిదారులకు ఇందులో ఎలాంటి వాటా లేదు. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 559గా ఉంది. గత 5 రోజుల్లో 10 శాతం పుంజుకుంది. 6 నెలల్లో 30 శాతానికిపైగా పెరిగింది. రానున్న రోజుల్లో కూడా పెరగడమేకానీ తగ్గడం ఉండదని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications