Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. సామాన్యుడి జేబుపై ఇంధన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 మార్కును దాటి అల్లకల్లోలం సృష్టిస్తున్నా, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారకుండా ఉండటం గమనార్హం. అయితే, అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో (హార్ముజ్ జలసంధి) నెలకొన్న సంక్షోభం కారణంగా ఎల్‌పిజి (LPG) సరఫరాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

దేశంలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్‌లెట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయి. మన రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తూ, తగినంత ముడి చమురు నిల్వలను కలిగి ఉన్నాయి. వదంతులు నమ్మవద్దు.. భయాందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దు" అని భరోసానిచ్చారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ.. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి చమురు దిగుమతులను వైవిధ్యపరచడం వల్ల భారత్ తన సరఫరాను స్థిరంగా ఉంచగలిగింది.

Stable Fuel Prices in India Why Petrol and Diesel Rates Remain Unchanged Despite High Brent Crude Costs

పెట్రోల్ విషయంలో ఊరట లభించినా, గ్యాస్ (LPG/LNG) రంగంలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా లేవు. భారత్ తన గ్యాస్ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా మనకు ప్రధాన సరఫరాదారు అయిన ఖతార్‌లోని ప్లాంట్లకు నష్టం వాటిల్లడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.

  • గృహ అవసరాలకే ప్రాధాన్యత: సామాన్యుడి వంట గదిలో పొయ్యి వెలగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గృహ అవసరాల గ్యాస్ పంపిణీకి మొదటి ప్రాధాన్యతనిస్తోంది.
  • కమర్షియల్ కటింగ్: దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై పడింది. వాణిజ్య సంస్థలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను ప్రభుత్వం ఏకంగా 50 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా, ఎరువుల కర్మాగారాల వంటి పారిశ్రామిక వినియోగదారులకు కూడా కేటాయింపులు తగ్గాయి.
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే!
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే!

అంతర్జాతీయ మార్కెట్ వర్సెస్ ఇండియన్ బాస్కెట్

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $95.56 నుండి $103.18 మధ్య ఊగిసలాడుతోంది. అంతర్జాతీయంగా ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తున్నా, 'ఇండియన్ బాస్కెట్' ధర మాత్రం బ్యారెల్‌కు $157.04 వద్ద కొనసాగుతోంది. ప్రాంతీయ సరఫరాలో ఉన్న రిస్క్ ప్రీమియం కారణంగా ఈ ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏదేమైనా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సమీక్షిస్తూ సామాన్యుడిపై భారం పడకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు (లీటర్):

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 ఉండగా, డీజిల్ రూ.87.67 వద్ద విక్రయించబడుతోంది. పశ్చిమ భారతంలోని ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.103.54 గా నమోదు కాగా, డీజిల్ ధర రూ.90.03 వద్ద ఉంది. తూర్పున ఉన్న కోల్‌కతాలో పెట్రోల్ అత్యధికంగా రూ.105.45 పలుకుతుండగా, డీజిల్ రూ.92.02 గా ఉంది.

పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం

దక్షిణాది నగరాల విషయానికి వస్తే, చెన్నైలో పెట్రోల్ రూ.100.84, డీజిల్ రూ.92.39 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఐటీ హబ్ బెంగళూరులో పెట్రోల్ ధర రూ.102 ఉండగా, డీజిల్ రూ.91.20 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ. ₹107.46 ఉండగా, డీజిల్ రూ.95.70 గా ఉంది.

ఏపీలోని విజయవాడలో పెట్రోల్ రూ. 109.65 లీటర్ కాగా, డీజిల్.. రూ97.47 వద్ద ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే అంతర్జాతీయ ముడి చమురు రేట్లు, కరెన్సీ మార్పిడి ధరల ఆధారంగా ఈ ధరలను సవరిస్తుంటాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+