Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెస్లా కార్లకు కొత్త తలనొప్పి: ఎలాన్ మస్క్‌కు భారీ షాక్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు భద్రత విషయంలో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఏకంగా 1.74 లక్షల కార్లపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఫీచర్లు ఉన్న కార్లను తయారు చేసే కంపెనీల్లో టెస్లా కూడా ఒకటి. ఈ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నులలో ఒకరు. అమెరికాలో టెస్లా మోడల్ వై కారు ధర సుమారు రూ.39.5 లక్షలుయ అయితే ఇప్పుడు ఈ మోడల్‌కు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆ కారు మోడల్ పై దర్యాప్తు మొదలైంది.

అసలేం జరిగింది?
టెస్లా తన మోడల్ వై కారును ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ కారు డోరు తెరుచుకోకపోతే అది కూడా లోపల పిల్లలు చిక్కుకుపోయినప్పుడు.. ఆ భద్రతపై ప్రశ్నలు తలెత్తడం సహజమే. అమెరికాలో కొంతమంది టెస్లా మోడల్ వై యజమానులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తల్లిదండ్రులు కారు డోర్ తెరవడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అద్ధాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీయాల్సి వచ్చింది. ఈ సమస్య కారులోని ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయకపోవడం వల్ల జరిగింది.

Tesla Model Y Under Investigation Safety Concerns Shock Elon Musk

దర్యాప్తునకు ఆదేశాలు
ఈ ఘటనలపై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(NHTSA) స్పందించింది. 2021 మోడల్ టెస్లా మోడల్ వైకి చెందిన సుమారు 1.74 లక్షల కార్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయడం లేదని తమకు ఫిర్యాదులు అందాయని ఓ నివేదిక పేర్కొంది.

సమస్యకు కారణాలు
ఎలక్ట్రానిక్ డోర్ లాక్‌కు తగినంత విద్యుత్ సరఫరా అందకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సమస్య ఎదురైన అనంతరం కొందరు కస్టమర్లు తమ కారులోని లో-వోల్టేజ్ బ్యాటరీని మార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే బ్యాటరీ తక్కువగా ఉన్నట్లు ఎలాంటి హెచ్చరికలు కూడా రాలేదని వారు పేర్కొన్నారు. టెస్లా కార్లలో లోపలి నుంచి డోర్‌ను మాన్యువల్‌గా తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. పిల్లలు చిన్నవారు కావడంతో ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు.

నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు అందిన ఫిర్యాదుల్లో కారు డోర్ లాక్ అవ్వడంతో తల్లిదండ్రులు పిల్లలను బయటకు తీయలేకపోయారని, నాలుగు కేసుల్లో పిల్లలను కాపాడటానికి కిటికీ అద్దాలను పగలగొట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం టెస్లా కార్ల భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+