Union Budget 2026 :నిర్మలమ్మా.. సొంతింటి కలను నెరవేర్చమ్మా..!
కేంద్ర బడ్జెట్ 2026-27 సమయం దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాల దృష్టి ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే నిలిచింది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగం ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఒకవైపు పెరుగుతున్న భూముల ధరలు, మరోవైపు భారంగా మారిన నిర్మాణ సామాగ్రి ఖర్చులు.. సామాన్యులకు సొంతింటి కలను దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే బడ్జెట్ నిర్మాణా రంగానికి ఊపిరి పోస్తుందా? మధ్యతరగతి సొంతింటి కలను ఎంతవరకు నెరవేర్చగలుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.
ఫిబ్రవరి 1,2026 న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై మద్యతరగతి వారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తమ సొంతింటి కలను 2026-27 ఆర్ధిక సంవత్సరంలో సాకారం చేసుకునే ప్రకటన కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.45 లక్షలలోపు ఉన్న ఇళ్లను మాత్రమే అఫర్డబుల్ హౌసింగ్గా పరిగణిస్తోంది. కానీ నేటి నగర వాస్తవ పరిస్థితుల్లో ఈ రూ.45 లక్షలకు సరైన ఇల్లు రాదు. మెట్రో నగరాల్లోనే కాదు, హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కూడా ఈ ధరకు ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకే ఈ లిమిట్‌ను రూ.80-90 లక్షల వరకు పెంచితేనే మధ్యతరగతికి ప్రయోజనం చేకూరుతుందని అందరి అభిప్రాయం.

జీఎస్టీ తగ్గింపునకు విజ్ఞప్తి..
ఇక జీఎస్టీ (GST) అంశం రియల్ ఎస్టేట్‌కు మరో పెద్ద అడ్డంకిగా మారింది. నిర్మాణ రంగంలో వర్క్ కాంట్రాక్టులపై ఉన్న 18 శాతం పన్ను ప్రాజెక్టుల ఖర్చును గణనీయంగా పెంచుతోంది. దీనివల్ల అనేక ప్రాజెక్టులు ఆర్థిక భారంతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో GSTను 12 శాతానికి తగ్గిస్తే నిర్మాణ వ్యయం తగ్గి, నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ముందుకు కదిలే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది డెవలపర్లకే కాదు, చివరికి ఇల్లు కొనుగోలు చేసే వారికి కూడా లాభం చేకూర్చే చర్యగా భావిస్తున్నారు.
హోమ్ లోన్ల భారం
బడ్జెట్ 2026-27లో మధ్యతరగతి, మొదటిసారి ఇల్లు కొనేవారు ప్రధాన ఫోకస్ కావాలని కోరుకుంటున్నారు రియల్టర్లు. గతంలో అమలులో ఉన్న సెక్షన్ 80EEA వంటి అదనపు వడ్డీ మినహాయింపులను మళ్లీ తీసుకు వస్తే ... హోమ్ లోన్ల భారం గణనీయంగా తగ్గుతుందని అంచనా. ముఖ్యంగా నగర పరిసర ప్రాంతాలు, టైర్-2, టైర్-3 సిటీల్లో గృహ కొనుగోళ్లకు ఇది పెద్ద బూస్ట్ ఇవ్వగలదు. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, మరో వైపు హౌసింగ్ డిమాండ్ కూడా అక్కడే ఎక్కువగా కూడా ఉంది.
గతేడాది బడ్జెట్‌లో..
రియల్ ఎస్టేట్ రంగాన్ని కేవలం ఆస్తి వ్యాపారంగా కాకుండా మౌలిక సదుపాయాల (Infrastructure) రంగంగా గుర్తించాలన్న డిమాండ్ ఈసారి మరింత బలంగా వినిపిస్తోంది. అలా చేస్తే దీర్ఘకాలిక నిధులు, తక్కువ వడ్డీ రుణాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం పీఎం అవాస్, పీఎంఎవై-అర్బన్ వంటి పథకాలకు గణనీయమైన కేటాయింపులు చేసింది. అయితే వేగంగా మారుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుంటే, ఇవి సరిపోవడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. కొత్త నగరాలు, ఉపాధి కేంద్రాలకు అనుగుణంగా హౌసింగ్ పాలసీలో మార్పులు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.
అందుబాటు ధరలో ఇల్లు..
మొత్తంగా చూస్తే, నిర్మలమ్మ పద్దు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రియల్ ఎస్టేట్ రంగానికి టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశముంది. అందుబాటు ధరలో ఇల్లు అనే పదానికి నిర్వచనాన్ని కేంద్రం ఈ సారి ఇవ్వాలని కోరుతున్నారు. జీఎస్టీ సర్దుబాటు, హోమ్ లోన్ పన్ను రాయితీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోదా వంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రంగం తిరిగి గట్టిపడుతుంది. అదే సమయంలో సామాన్యుడికి సొంతింటి కల మరింత చేరువవుతుంది. ఆర్థిక మంత్రి తీసుకునే నిర్ణయాలే రాబోయే సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ దిశను నిర్ణయించబోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications