EPFO: దశాబ్దం తర్వాత కేంద్ర చారిత్రాత్మక నిర్ణయం.. 51 లక్షల మందికి గుడ్ న్యూస్
దేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన వార్త అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోకి వచ్చే సేవకుల వేతన పరిమితిని భారీగా పెంచుతూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నెలకు రూ. 15,000 ఉన్న ఈ పీఎఫ్ వేతన గరిష్ఠ పరిమితిని ఏకంగా రూ. 25,000కు పెంచుతూ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
51 లక్షల మందికి ప్రత్యక్ష ప్రయోజనం!
ఈ సంచలన నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ఈ సామాజిక భద్రతా పథకం విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున రూ. 11,339 కోట్ల నిధులను ఖర్చు చేయబోతోంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 17 నుంచే అమలులోకి రానుంది.

దశాబ్దం తర్వాత చారిత్రాత్మక మార్పు!
గతంలో 2004 నుంచి 2014 వరకు పీఎఫ్ వేతన పరిమితి ఎలాంటి మార్పూ లేకుండా కొనసాగింది. అనంతరం సెప్టెంబర్ 2014లో దీనిని రూ. 15,000కు పెంచారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రూ. 25,000కు పెంచడం విశేషం. అనేక రాష్ట్రాల్లో కనీస వేతనాలు ఇప్పటికే రూ. 15,000 కంటే దాటిపోయిన నేపథ్యంలో 2014 పరిమితి కాలం చెల్లినదైందని, అందుకే సమగ్ర సంప్రదింపుల తర్వాత ఈ సీలింగ్‌ను రూ. 25 వేలకు పెంచినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఉద్యోగులు, యాజమాన్యాలకు డబుల్ బెనిఫిట్!
రూ. 15,000 కంటే ఎక్కువ జీతంతో కొత్తగా ఉద్యోగంలో చేరే చాలామందికి పీఎఫ్, పెన్షన్, సంబంధిత బీమా రక్షణ లభించేది కాదు. తాజాగా వేతన సీలింగ్‌ను రూ. 25,000కి పెంచడం వల్ల రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య సంపాదించే మధ్యతరగతి ఉద్యోగులందరూ ఇకపై చట్టబద్ధంగా ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లను పెంచడమే కాకుండా, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు తమ సిబ్బందికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది.














Click it and Unblock the Notifications
