UPI: భీభత్సంగా వాడేస్తున్నారు, రోజుకు 80 కోట్ల పేమెంట్లు..

దేశంలో డిజిటల్ చెల్లింపుల అలవాటు సామాన్యుడి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతీచోటా క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి చెల్లించడమే ప్రాథమిక ఎంపికగా మారింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో యూపీఐ ద్వారా ఏకంగా 14,500 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 27 శాతం పెరుగుదల కావడం విశేషం. నగదు విలువ పరంగా చూస్తే, గతేడాది రూ. 148 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ ఈసారి 20 శాతం పెరిగి ఏకంగా రూ. 177 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలలో రోజువారీ సగటు చూస్తే దాదాపు 80.2 కోట్ల లావాదేవీలు జరగడం భారత డిజిటల్ వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలు

మరోవైపు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌పీసీఐ సరికొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెస్తోంది. అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీని కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది తప్ప సాధారణ వినియోగదారులకు ఎలాంటి భారం పడదు. వ్యాపారుల వద్ద జరిగే పెద్ద మొత్తాల చెల్లింపులకే ఇది పరిమితం కాగా, రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఈ రుసుము గరిష్టంగా రూ. 300 దాటకుండా క్యాపింగ్ విధించారు. ఈ రుసుము ద్వారా వచ్చే ఆదాయాన్ని పేమెంట్ నెట్‌వర్క్‌లోని బ్యాంకులు, యాప్‌లు, గేట్‌వేలు పంచుకుంటాయి.

UPI Payments Surge 27 Percent to 145 Billion Transactions in First Half as New MDR Rules Approach
యూపీఐ ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం: ఆర్బీఐ + కేంద్రానికి తక్షణమే.. !!
యూపీఐ ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం: ఆర్బీఐ + కేంద్రానికి తక్షణమే.. !!

చిన్న వ్యాపారులు, సామాన్యులకు ఉచితంగానే సేవలు

సాధారణ ప్రజలు ఒకరికొకరు పంపుకునే వ్యక్తిగత లావాదేవీలు (P2P) ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. దాంతోపాటు వ్యాపారస్తుల వద్ద జరిగే మెజారిటీ చిన్న చిన్న చెల్లింపులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవు. నెలకు యూపీఐ క్యూఆర్‌ కోడ్ ద్వారా రూ. 1 లక్ష వరకు వ్యాపారం చేసే చిన్న దుకాణదారులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. రవాణా, పెట్రోల్, ఇన్సూరెన్స్ వంటి నిత్యావసర సేవల్లో రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేసినప్పుడు లావాదేవీకి కేవలం రూ. 5 ఫ్లాట్ ఛార్జ్ మాత్రమే పడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ చెల్లింపులకు 0.02 శాతం రుసుము వర్తిస్తుంది.

UPI MDR: తేల్చేసిన నిర్మలమ్మ! పన్ను కాదు, సెస్ అసలే కాదు.. పూర్తిగా ఫ్రీ
UPI MDR: తేల్చేసిన నిర్మలమ్మ! పన్ను కాదు, సెస్ అసలే కాదు.. పూర్తిగా ఫ్రీ

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లోనూ భారత యూపీఐ హవా!

భారత్‌లోనే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా మన యూపీఐ తన జెండాను పాతేస్తోంది. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌తో కలిపి మొత్తం 11 దేశాల్లో భారత యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్ వంటి దేశాల్లో మనవాళ్లు యూపీఐ ద్వారా సునాయాసంగా లావాదేవీలు చేసుకోవచ్చు. 2016 ఆగస్టులో ప్రారంభమైన యూపీఐ ప్రయాణంలో తొలి ఏడాది నమోదైన రూ. 0.07 లక్షల కోట్ల విలువైన లావాదేవీల నుంచి, పదేళ్ల కాలంలో ఏకంగా రూ. 314 లక్షల కోట్ల స్థాయికి చేరడం భారత ఆర్థిక సాంకేతిక విప్లవంలో సరికొత్త అధ్యాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+