నా మనసు చలించింది, జై హనుమాన్ - చిరంజీవి..!!

స్మిత్ మచ్చార్‌. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి. ఇజ్రాయెల్ విమానంలో దాడి జరిగిన సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రయాణీకులను కాపాడిన మచ్చర్ ధైర్య సాహసాల పై అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రధాని మోదీ వీడియో కాల్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్ తో మాట్లాడారు. ఇక.. మచ్చర్ ఆ సమయంలో చెప్పిన అంశాలు.. ఆయన తెగువ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో దాడి జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడినా.. తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే మచ్చార్ పైన ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ సైతం వీడియో కాల్ లో మచ్చర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Chiranjeevi Praises Pilot Captain Smith Machar for Saving Passengers Lives social media post goes viral

మచ్చర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. జరిగిన ఘటన పైన ఆరా తీసారు. యావత్ దేశం మచ్చర్ కు అండగా నిలుస్తుందని... మచ్చర్ ధైర్యాన్ని ప్రతీ భారతీయుడు అభినందిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన స్మిత్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు.

ఎందరో ప్రాణాలు కాపాడిన మచ్చార్ త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని చిరంజీవి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. 'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.

ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్' అంటూ ఎక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+