మామునూర్ ఎయిర్‌పోర్టు పనుల దూకుడుకు బ్రేక్.. ఆ తిరస్కరణతో పనుల్లో జాప్యం?

మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో మరోసారి జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మామునూరు ఎయిర్పోర్ట్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసి ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తున్న వేళ అనుమతుల జాప్యం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శాపంగా మారింది. రికార్డు సమయంలో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి భూమిని అప్పగించినప్పటికీ, అనుమతుల ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది.

ప్రధాన అడ్డంకి పర్యావరణ అనుమతి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ - ఈసీ.. ఈ అనుమతి రాకుండా నిర్మాణ పనులు ప్రారంభించడం సాధ్యం కాదు. గతంలో దరఖాస్తు చేసిన కన్సల్టెన్సీ సంస్థ దరఖాస్తును తిరస్కరించడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. దీంతో అధికారులు జనవరి నెలలో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు.

Delay in Mamnoor Airport works rejects environmental clearance application for warangal airport

కొత్త దరఖాస్తు సమర్పించిన తర్వాత పర్యావరణ శాఖ పరిశీలన చేసి మార్చి నెలలోగా ఈసీ మంజూరు చేస్తే, 2027 ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు.
మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు చాలా కాలంగా స్థానిక ప్రజల చిరకాల కలగా ఉంది. ఈ ప్రాంతంలో విమానాశ్రయం వస్తే రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని, వ్యాపారాలు, పర్యాటకం అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశపడుతున్నారు.

భూసేకరణ దశలోనే చాలా సవాళ్లు ఎదురైనా, వేగంగా పూర్తి చేసి ఏఏఐకి అప్పగించడం జరిగింది. అయినా అనుమతుల విషయంలో జరుగుతున్న ఆలస్యం ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది.
పర్యావరణ అనుమతి కోసం అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ప్రభావం, పర్యావరణ సంరక్షణ చర్యలు, స్థానిక పరిస్థితులు వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

అయితే గత దరఖాస్తు తిరస్కరణకు గురి కావటంతో గత దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉండి ఉండొచ్చని, కొత్త దరఖాస్తులో వాటిని సరిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు. జనవరిలో దరఖాస్తు చేసి, మార్చిలో క్లియరెన్స్ వస్తే ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరగానే మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం ప్రారంభం అవుతుందని, టెండర్ల ప్రక్రియ చూసి సంతోషపడిన స్థానికప్రజలు పర్యావరణ అనుమతి రాకపోవటంతో నిరాశగా ఉన్నారు.

ప్లాస్టిక్ నియంత్రణకు స్వీట్ ప్లాన్.. రెస్పాన్స్ అదుర్స్!
ప్లాస్టిక్ నియంత్రణకు స్వీట్ ప్లాన్.. రెస్పాన్స్ అదుర్స్!

ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకు సాగాలని అధికారులు పూర్తిగా దీనిపై ఫోకస్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+