కస్టమర్ల ఖాతాల్లో రూ. లక్షలు నొక్కేసిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్, ఆన్ లైన్ రమ్మీ ఆడేసి?, భలే చాన్స్!
బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ మేనేజర్ భాగోతం గురించి బయటకు రావడంతో ఆ బ్యాంకు ఖాతాదారులతో పాటు, బ్యాంకు సిబ్బంది హడలిపోయారు.
చెన్నై/వేలూరు: బ్యాంకులో మంచి ఉద్యోగం రావడంతో అతని కుటుంబ సభ్యులు సంతోషించారు. ప్రతిరోజు బ్యాంకుకు వెళ్తి ఉద్యోగం చేసి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. బ్యాంకులో కూడా ఆ అసిస్టెంట్ మేనేజర్ గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అసిస్టెంట్ మేనేజర్ అసలు భాగోతం గురించి బయటకు రావడంతో ఆ బ్యాంకు ఖాతాదారులతో పాటు, బ్యాంకు సిబ్బంది హడలిపోయారు.
తమిళనాడులోని వేలూరు జిల్లాలోని గాంధీనగర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. ఇదే బ్యాంకులో యోగేశ్వర్ పాండియన్ అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు, బ్యాంకులో లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ గా పాండియన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చాలాకాలం నుంచి అదే బ్రాంచ్ లో పాండియన్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల బ్యాంకులో గోల్ మాల్ జరిగిందని అధికారులకు అనుమానం వచ్చింది. చెన్నై నుంచి వేలూరు వెళ్లిన బ్యాంకు అధికారులు ఆడిటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పాండియన్ అవకతవకలకు పాల్పడ్డాడని వెలుగు చూడటంతో బ్యాంకు అధికారులు అతని మీద వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ రమ్మీ గేమ్ కు అలవాటుపడిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పాండియన్ ఖాతాదారుల అకౌంట్ల నుంచి అతని అకౌంట్ కు రూ. 34 లక్షలు బదిలి చేసుకున్నాడని వెలుగు చూసింది.
2018 జూన్ నెల నుంచి 2021 జులై మధ్య కాలంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ పాండియన్ 137 మంది బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ ల నుంచి రూ. 34 లక్షలు అతని అకౌంట్ కు బదిలి చేసుకుని ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఆడాడని వెలుగు చూడటంతో ఖాతాదారులు హడలిపోయారు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పాండియన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని వేలూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications