Vaccination camps: నోస్టాక్, సిటీలో ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కు బ్రేక్, అందుకే !

చెన్నై: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి చెన్నైలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో చెన్నై సిటీలో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు. ఎక్కడెక్కడ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయో లెక్కలు చూసిన తరువాత మళ్లీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ మొదలౌతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. చెన్నై సిటీలోని పలు ప్రధాన ఏరియాలతో పాటు మార్కెట్లు, ఆరోగ్య కేంద్రాల్లో సామాన్య ప్రజలకు కొన్ని రోజుల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు.

GCC చిన్న షాక్ ఇచ్చింది

GCC చిన్న షాక్ ఇచ్చింది

చెన్నైలో వేగంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చెన్నై సిటీలోని పలు ప్రధాన ఏరియాలతో పాటు మార్కెట్లు, ఆరోగ్య కేంద్రాల్లో సామాన్య ప్రజలకు కొన్ని రోజుల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. చెన్నై కార్పోరేషన్ (GCC) అధికారులు ఆదివారం సాయంత్రం వారు నిర్వహిస్తున్న వెబ్ సైట్ లో సోమవారం (జూన్ 28వ తేది) చెన్నైలో ఎక్కడకాని కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం లేదని సమాచారం ఇచ్చారు.

వెబ్ సైట్ లో పూర్తి సమాచారం

వెబ్ సైట్ లో పూర్తి సమాచారం

చెన్నైలో ఎక్కడెక్కడ కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారో పూర్తి సమాచారాన్ని చెన్నై కార్పోరేష్ అధికారులు వెబ్ సైట్ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. జూన్ 27వ తేదీన ఆదివారం నగరంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, కోవిడ్ వ్యాక్సిన్ శిభిరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.

అందుకే ఈ రోజు బ్రేక్

అందుకే ఈ రోజు బ్రేక్

ఆదివారం చెన్నై సిటీలో ఎక్కడెక్కడ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు మిగిలాయో పూర్తి డేటా సేకరించిన తరువాత మళ్లీ కోవ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెన్నై కార్పోరేషన్ కమీషనర్ గగన్ దీప్ సింగ్ బేడీ స్థానిక మీడియాకు చెప్పారు. కోవిడ్ డోసుల స్టాక్ వచ్చిన తరువాత చెన్నైలోని 45 జీసీసీ కేంద్రాల్లో, సిటీలోని 19 ఆరోగ్య కేంద్రాల్లో మళ్లీ కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెన్నై కార్పోరేషన్ కమీషనర్ గగన్ దీప్ సింగ్ బేడీ అన్నారు.

హైకోర్టులో ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్

హైకోర్టులో ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్

జూన్ 28వ తేదీన మద్రాసు హైకోర్టు (చెన్నై హైకోర్టు)లో న్యాయవాదులు, హైకోర్టు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జీసీసీ అధికారులు ముందుగానే నిర్ణయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసి ఉంది. అయితే అనివార్యకారణాల వలన తాత్కాలికంగా వాయిదాపడిందని జీసీసీ అధికారులు అంటున్నారు.

లెక్కలు చూడాలి

లెక్కలు చూడాలి

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జూన్ 28వ తేదీ కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉంటుందా ? అని స్థానిక మీడియా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నించింది. ఆదివారం ఆలస్యంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైయ్యిందని, ఎక్కడ ఎన్ని డోసులు మిగిలాయో డేటా అందిన తరువాత పూర్తి సమాచారం తెలుస్తోందని తమిళనాడు ఆరోగ్య శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అంటున్నారు. జూన్ 26వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 3, 72, 618 కోవిడ్ డోసులు వేశారు. అయితే జూన్ 27వ తేదీన 89, 402 కోవిడ్ డోసులు మాత్రమే వేశారని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+