వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉరి వేసుకున్న గర్ల్ ఫ్రెండ్, ఎంజాయ్ చేసిన ప్రియుడు!

బెంగళూరు: యువతి. యువకుడు ప్రేమించుకున్నారు. యువతి ఉద్యోగం చేస్తున్నది. ఇటీవల ప్రేమికుల మద్య గొడవలు మొదలైనాయి. ఏం చెయ్యాలో తెలీక యువతి ఆవేదన చెందింది. ప్రియుడితో గంట సేపు వీడియో కాల్ లో మాట్లాడింది. చివరికి ప్రియురాలు వీడియో కాల్ లో టాటా చెప్పి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రియుడు శాడిస్టు లాగా ఎంజాయ్ చేశాడు.

తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని తిరువెంకాడు సమీపంలోని మరుదూరు ప్రాంతంలో అర్చన (24) అనే యువతి నివాసం ఉంటున్నది. తిరువారూర్ జిల్లాలోని ఎటీర్ పట్టణంలోని అన్నపూర్ణ ఫైనాన్స్ కంపెనీలో అర్చనా అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. మూడు సంవత్సరాల నుంచి అర్చనా అక్కడే పని చేస్తున్నది.

Girlfriend hanged herself while talking to her boyfriend on a video call in Tamil Nadu

నాగపట్టణం జిల్లాలోని వడగాడు సమీపంలోని పంచకడికులం ప్రాంతంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ (26) అనే యువకుడు, అర్చనా మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు అర్చనా, సత్యరాజ్ ఇంతకాలం సినిమాలు, శికార్లు, విహారయాత్రలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

ప్రియురాలు అర్చనా మీద మోజు తీరిపోవడంతో సత్యరాజ్ ఆమెను దూరం చేసుకోవాలని ప్రయత్నించాడు. ప్రియుడు సత్యరాజ్ దూరం అవుతున్నాడని తెలుసుకున్న అమాయకురాలు అర్చనా ఆవేదన చెందింది. తనను పెళ్లి చేసుకోవాలని, తనను మోసం చెయ్యకూడదని అర్చనా ఆమె ప్రియుడు సత్యరాజ్ ను వేడుకునింది.

అయితే ప్రియురాలు అరచ్చనా ఏడస్తూ తన కోసం ఆరాటపడుతున్నదని తెలుసుకున్న ఆమె ప్రియుడు సత్యరాజ్ శాడిస్టు లాగా ప్రవర్తించి ఆమెకు ఇంకా దూరం అయ్యాడు. ఉద్యోగం చెయ్యడానికి ఆఫీసుకు వెళ్లిన అర్చనా మధ్యాహ్నం బోజనం సమయంలో ఆమె ఇంటికి వెళ్లిపోయింది, తరువాత అర్చనా ఆమె ప్రియుడు సత్యరాజ్ కు ఫోన్ చేసింది.

ప్రియుడు సత్యరాజ్ కు వీడియో కాల్ చేసి సుమారు గంట సేపు మాట్లాడిన అర్చనా నువ్వు పెళ్లి చేసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందు తనకు ఒకసారి టాటా చెప్పాలని సత్యరాజ్ అతని ప్రియురాలు అర్చనాకు చెప్పాడు. ప్రియుడు ఈ జీవితంలో మారడని అర్చనా డిసైడ్ అయ్యింది.

వీడయో కాల్ లో ప్రియుడు సత్యరాజ్ కు టాటా చెప్పిన అర్చనా ఉరి వేసుకుంది. ప్రియురాలు అర్చనా ఉరి వేసుకున్న సమయంలో సత్యరాజ్ హ్యాపీగా నవ్వుతూ సైకోలాగా ఎంజాయ్ చేశాడు. తరువాత అర్చనా ప్రాణం పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అర్చనా ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె ప్రియుడు సత్యరాజ్ రెచ్చగొట్టాడని అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+