Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

చెన్నై/తిరుచ్చి: భర్తతో కలిసి హ్యాపీగా జీవిస్తున్న లేడీ డ్రాయింగ్ టీచర్ జీవితంలోకి ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. డ్రాయింగ్ టీచర్ బోమ్మలు బాగా వెయ్యడంతో ఆమెతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్ల పాటు లేడీ టీచర్ భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త డ్రాయింగ్ టీచర్ కు బెండ్ తీశాడు. డ్రాయింగ్ టీచర్ సూపర్ స్కెచ్ వేసి ప్రియుడు. అతని స్నేహితులతో కలిసి భర్తను చంపించింది. భర్త బంధువులు ఎక్కడ తన మీద కేసు పెడుతారో అనే భయంతో లేడీ టీచర్ ముందుగా పోలీసు కేసు పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

లేడీ టీచర్ హ్యాపీలైఫ్

లేడీ టీచర్ హ్యాపీలైఫ్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా బి. మెట్టూరు సమీపంలోని సైథాపేట్ లో పళనివేల్ (42), మోహనపాల్ (38) దంపతులు నివాసం ఉంటున్నారు. పళనివేల్, మోహనాపాల్ దంపతులకు 15 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. మోహనాపాల్ ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.

భర్త బిజీబిజీ.... భార్య ఎంగేజ్

భర్త బిజీబిజీ.... భార్య ఎంగేజ్

పళనివేల్ పెద్ద భూస్వామి. ఓ పక్క వ్యవసాయం చేయిస్తూ మరో వైపు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తూ బిజీబిజీగా ఉండేవాడు. ఇదే సమయంలో మేడమ్ మోహనాపాల్ భర్తతో గొడవపడటం మొదలుపెట్టింది. ఇటీవల భర్త పళనివేల్ తో గొడవ పడిన డ్రాయింగ్ టీచర్ ఇద్దరు పిల్లలను పిలుచుకుని వేరుగా కాపురం పెట్టింది.

శవమైన భర్త

శవమైన భర్త

పెద్దలు రాజీ చెయ్యడంతో మూడు నెలల క్రితం డ్రాయింగ్ టీచర్ మోహనాపాల్, పళనివేల్ దంపతులు ఒక్కటి అయ్యారు. పిల్లలతో కలిసి పళనివేల్, మోహనాపాల్ కలిసి జీవిస్తున్నారు. ఈనెల 19వ తేదన తాపేటై సమీపంలోని తురైయూర్ రోడ్డులోని తేవరంపట్టి అటవి ప్రాంతంలో పళనివేల్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మోహనాపాల్ కు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేశారు. పళనివేల్ బైక్ ద్వంసం కావడం, అతని శరీరంపై ఎక్కువ గాయాలు కాకపోవడంతో అనేక అనుమానాలు మొదలైనాయి.

నా మొగుడిని ఎవరో చంపేశారు

నా మొగుడిని ఎవరో చంపేశారు

ఆసుపత్రిలో భర్త శవాన్ని చూసిన మోహనాపాల్ ఆర్తనాదాలు చేసింది. నా భర్తను ఎవరో చంపేశారని, ఆయన మృతి అనునమానాస్పదంగా ఉందని, తన భర్తను చంపడంతో తన జీవితం నాశనం అయ్యిందని, నా భర్త హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చెయ్యాలని పోలీసుల ముందు మోహనాపాల్ ఓ రైంజ్ లో డ్రామాలు ఆడింది.

రంగంలోకి మామలు

రంగంలోకి మామలు

జంబునాథపురం పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ కన్నదాసన్ స్వయంగా కేసు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో మరణించిన పళనివేల్ స్నేహితుడు రాజా (42) పేరు తెరమీదకు వచ్చింది. అలతుడైపట్టి ప్రాంతానికి చెందిన రాజా తురైయూర్ సమీపంలోని ఉప్పలియాపురం ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మేడమ్ మోహనాపాల్, రాజా వ్యవహారం గురించి పోలీసులకు తెలిసింది.

నాలుగేళ్ళు డ్రాయింగ్ టీచర్ రొమాన్స్

నాలుగేళ్ళు డ్రాయింగ్ టీచర్ రొమాన్స్

పళనివేల్ భార్య మోహనాపాల్, అతని ఫ్రెండ్ రాజాను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. ఆ సమయంలో టిక్కులాడి డ్రాయింగ్ టీచర్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఫ్రెండ్ పళనివేల్ కోసం రాజా అతని ఇంటికి వెళ్లేవాడు. పళనివేల్ ఇంట్లో లేని సమయంలో రాజా డ్రాయింగ్ టీచర్ మోహనాపాల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, గత నాలుగేళ్ళుగా వీళ్లు అక్రమ సంబంధం సాగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

బెడ్ రూమ్ లో భార్య, ప్రియుడు.... భర్త ఎంట్రి

బెడ్ రూమ్ లో భార్య, ప్రియుడు.... భర్త ఎంట్రి

పనిమీద బయటకు వెళ్లిన పళనివేల్ ఓ రోజు అనుకోకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో డ్రాయింగ్ టీచర్ మోహనాపాల్, రాజా బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తున్న విషయం గుర్తించిన పళనిస్వామి ఇద్దరికి బెండ్ తీసి వార్నింగ్ ఇచ్చాడు. తన భర్తను చంపేస్తే పీడపోతుందని మేడమ్ మోహనాపాల్ కు చెప్పింది. ప్రియురాలి భర్త పళనివేల్ ను చంపేయడానికి కిరాయి హంతకుడు భరత్ (38)తో రూ. 1.50 లక్షలకు ప్రియుడు రాజా డీల్ మాట్లాడుకున్నారు. అనుకున్నట్లే భరత్ అతని గ్యాంగ్ ఈ నెల 19వ తేదీన బైక్ లో వెలుతున్న పళనివేల్ ను కారులో వెంబడించి అటవి ప్రాంతంలో అతన్ని చంపేసి అతని బైక్ నాశనం చేసి ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించారు.

డ్రాయింగ్ టీచర్ బోమ్మ రివర్స్

డ్రాయింగ్ టీచర్ బోమ్మ రివర్స్

పళనివేల్ బైక్ ధ్వంసం అయినా అతనికి ఎలాంటి గాయాలు కావడంతో కథ అడ్డం తిరిగింది. తన భర్త పళనివేల్ ను ప్రియుడు రాజాతో కలిసి హత్య చేయించానని డ్రాయింగ్ టీచర్ మోహనాపాల్ అంగీకరించింది. మేడమ్ మోహనాపాల్ (38), ఆమె ప్రియుడు రాజా (42), కిరాయి హంతకుడు భరత్ (38), అతని గ్యాంగ్ లోని విఘ్నేశ్వరన్ (21), ప్రదీప్ (21), కార్తీక్ (26)ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. మేడమ్ మోహనాపాల్ ను తిరుచ్చి మహిళా సెంట్రల్ జైలుకు, మిగిలిన నిందితులను తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. లేడీ టీచర్ కామానికి ఆమె భర్త పళనివేల్ హత్యకు గురి కావడం తిరుచ్చిలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+