• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kamal Haasan కన్నీటి పర్యంతం: అభిమానిని అలా చూసి భావోద్వేగానికి గురైన లోకనాయకుడు.!

|

చెన్నై: భారత్‌లో సినిమాలకు ఉన్న అభిమానం మరే దేశంలోను కనిపించదేమో. అంతేకాదు ఇక్కడ నటులను కూడా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. తమ అభిమాన నటుల కోసం గుళ్లు గోపురాలు సైతం కట్టిన ఘటనలు దేశంలో చాలా ఉన్నాయి. ఇక అభిమానులకు ఏమైనా కష్టం వచ్చిందని తెలిస్తే సూపర్‌స్టార్లు కూడా వారిని ఆదుకున్న ఘటనలు ఉన్నాయి.

ఇక కరోనా కాలంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు దేశం మొత్తం మారుమోగి పోయింది. ఆయన చేసిన సహాయం వర్ణించలేనిది. సోనూ సూద్‌ను దేవునితో కొలిచారు. తాజాగా యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్‌ తన అభిమానితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

ధైర్యం చెప్పిన లోకనాయకుడు

కమల్ హాసన్ అభిమాని సాకేత్ క్యాన్సర్ బారిన పడ్డాడు. బ్రెయిన్ క్యాన్సర్ మూడ్ దశలో ఉంది. తన అభిమాని సాకేత్‌ క్యాన్సర్ బారిన పడ్డారని తెలుసుకున్న కమల్ హాసన్ అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. తన భార్య, బిడ్డలు తన కుటుంబం కోసం కచ్చితంగా ఈ క్యాన్సర్‌ను జయిస్తాననే నమ్మకం తనలో ఉందని సాకేత్ చెప్పాడు. నువ్వు తప్పక జయిస్తావని కమల్ చెప్పి సాకేత్‌కు భరోసా ఇచ్చారు. సాకేత్ మాటలు విన్న లోకనాయకుడు భావోద్వేగానికి గురయ్యాడు.

అంతకుముందు కమల్ హాసన్ మాట్లాడుతూ "ఎవరూ ఓటమి చూడరు అనేది నేను ఎప్పుడూ చెబుతుంటాను. కేన్సర్‌తో పోరాడి దానిపై గెలిచినవారు 40 మిలియన్ మంది ఉన్నారు. వారి తర్వాత నీకు వచ్చింది. నువ్వు కూడా క్యాన్సర్‌పై విజయం సాధిస్తావన్న నమ్మకం ఉంది. నువ్వు ఇప్పటికే గెలిచావు.. గెలవాలని రాసి ఉంది" అని సాకేత్‌తో చెప్పారు.

సాకేత్ కోసం ప్రార్థనలు చేయండి

ఇక కమల్‌హాసన్‌ మరియు సాకేత్‌లు ఆన్‌లైన్ వేదికపై వచ్చేందుకు సంధ్య వైద్యనాథన్ అనే ఓ మహిళ కృషి చేశారు. కమల్ హాసన్‌తో మాట్లాడాలన్న సాకేత్ కోరికను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ సంధ్యా వైద్యనాథన్ తన ఇన్స్‌టా పోస్టులో రాసుకొచ్చారు. కమల్ హాసన్‌ను కలిసేందుకు అతని బృందం చేసిన సహాయం మరవలేనిదని చెబుతూ వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు కన్నీళ్లు ఆగడం లేదని రాసుకొచ్చారు. ఇదొక చరిత్రని చెప్పిన సంధ్య... పలువురి కోరికలు నెరవేర్చేందుకే తాను ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ప్రజలకు సహాయం చేయడంలో ఎంతో తృప్తి ఉందని వెల్లడించింది. సాకేత్ మూడవ స్టేజ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని తను చాలా పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పిన సంధ్య.. ప్రతి ఒక్కరూ అతనికోసం ప్రార్థనలు చేయాలని కోరింది.

కమల్‌కు థ్యాంక్యూ చెప్పిన నెటిజెన్లు

కమల్‌కు థ్యాంక్యూ చెప్పిన నెటిజెన్లు

ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు కమల్ హాసన్ తీరుపై ప్రశంసలు కురిపించారు. కమల్ హాసన్‌ను ప్రేమించిన ప్రతి వారికి మంచే జరుగుతుందని తప్పకుండా సాకేత్ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారని ఒక నెటిజెన్ కామెంట్‌లో రాసుకొచ్చాడు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారితో మాట్లాడి ధైర్యం చెబుతున్న కమల్ హాసన్‌కు థ్యాంక్స్ చెబుతూ మరో నెటిజెన్ పోస్టు చేశాడు.

ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా విక్రమ్‌‌లో నటిస్తున్నారు. త్వరలోనే అది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మధ్యనే దశావతారం సినిమా విడుదలై 13 ఏళ్లు అయిన నేపథ్యంలో చిన్నపాటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

English summary
Kamal Haasan goes on a video call with his fan who is suffering from Cancer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X