కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్: చెన్నై ఆస్పత్రిలో చికిత్స
చెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేగాక, 'కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాలి' అని కమల్ హాసన్ సూచించారు.
సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. యూఎస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఇన్‌ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారు అని తెలిపారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసొలేషన్‌లో ఉన్నట్టు కమల్ హాసన్ వెల్లడించారు.

కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే.. ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను సినీ ప్రముఖులు, అభిమానులు వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం.. మరిప్పుడు తమిళ బిగ్ బాస్‌ను ఎవరు నిర్వహిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు తమిళ బిగ్ బాస్‌ను కమల్ హాసన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గత వారం, కమల్ హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్ అమృత రామ్‌తో కలిసి కేహెచ్ హౌస్ ఆఫ్ ఖద్దర్ అనే తన దుస్తులను ప్రారంభించారు. ఖాదీని టెక్స్‌టైల్‌గా ప్రమోట్ చేసే బ్రాండ్‌ను రూపొందించడం ఆ బ్రాండ్ వెనుక ఉన్న ఆలోచన.
'చికాగో గొప్ప చరిత్ర కలిగిన ఒక ప్రత్యేక నగరం. ఇక్కడి దేశీ సంస్కృతి దాని గురించి మాట్లాడుతుంది. మా బ్రాండ్‌ను ప్రదర్శించడానికి సరైన నగరం కావాలి. ఇక్కడి జనాభా సువాసన, దుస్తులు రెండింటినీ ఎక్కువగా అర్థం చేసుకుంటారు' అని కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications