Mandous: చెన్నై చిత్తడి, తీరం దాటిన మాండూస్ తుపాను, ఆంధ్రాలో హై అలర్ట్, సైక్లోన్ దెబ్బతో!
చెన్నై/కన్యాకుమారి: మాండూస్ సైక్లోన్ ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలవపెడుతున్న మాండూస్ సైక్లోన్ దెబ్బతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు ప్రాంతాల్లోని రహదారుల్లో వరద నీరు అడుగుల ఎత్తులో నిలిచిపోవడంతో ప్రజలు బయటకురాలేక నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులోని అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ముందుజాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. తుపాన్ దెబ్బతకు చెన్నై సిటీ అతలాకుతలం అయ్యింది. తమిళనాడులోని 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం, తుపాను తమిళనాడు తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. బెంగళూరులో కూడా శుక్రవారం రాత్రి నుంచి నిలపకుండా తేలికపాటి వాన కురుస్తోంది.

చెన్నై జలమయం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు ప్రాంతాల్లోని రహదారుల్లో వరద నీరు అడుగుల ఎత్తులో నిలిచిపోవడంతో ప్రజలు బయటకురాలేక నరకం అనుభవిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే చెన్నైలోని మెరీనా బీచ్ పక్షులు కూడా కనపడటం లేదు. చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగిపోయాయి.

తీరం దాటిన తుపాను
శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మాండూస్ తుపాను తమిళనాడు తీరం దాటడం మొదలుపెట్టింది. శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో మాండూస్ తుపాను తమిళనాడు తీరం దాటిపోయింది. మాండూస్ తుపాను తీరం దాటడంతో చెన్నై సిటీ ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు మెల్లిమెల్లిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

చెన్నై చిత్తడి
మాండూస్ తుపాను దెబ్బతో చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో వేలాది చెట్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెన్నై మెరీనా బీచ్ లో ఏర్పాటు చేసిన షాపులు అయితే గాల్లో ఎగిరి సముద్రంలో కలిసిపోయాయి. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లోని రహదారులు మొత్తం ఇసుకతో నిండిపోయింది.

అర్దరాత్రి మీడియా సమావేశం
శుక్రవారం అర్దరాత్రి చెన్నై వాతావరణ కేంద్రం దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్ బాలచంద్రన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. మాండూస్ తుపాను దెబ్బతో కట్టుపాక్కంలో 142 సెంటీమీటర్లు, చెన్నైలోని నుంగంబాక్కంలో 106 సె.మీ, మీనంబాక్కంలో 103 సె.మీ, మాధవరంలో 87 సె.మీ. తిరువళ్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 142 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని బాలచంద్రన్ చెప్పారు.

రంగంలోకి అధికారులు
చెన్నై సిటీలో వరద నీటితో పలు ప్రాంతాలు జలమయం కావడంతో వర్షపునీటిని తొలగించడానికి చెన్నై సిటీ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు మరమత్తలు చేపట్టారు. నేలకూలిన చెట్లను రోడ్ల మీదను కార్పోరేషన్ సిబ్బంది, అటవి శాఖ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications