చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు.. ఆ చిన్నారులకు బంగారు ఉంగరాలు కానుకలు; ఎక్కడంటే!!

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీ తమిళనాడు యూనిట్ సెప్టెంబర్ 17 న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బంపర్ ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం రోజు పుట్టిన నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు 72వ జన్మదినం సందర్భంగా 720 కిలోల చేపలను పంపిణీ చేయడం వంటి ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది.

మోడీ జన్మదినం నాడు పుట్టిన చిన్నారులకు బంపర్ బహుమతి

మోడీ జన్మదినం నాడు పుట్టిన చిన్నారులకు బంపర్ బహుమతి

చెన్నైలోని ప్రభుత్వ ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ఆస్పత్రిని గుర్తించి, ప్రధాని పుట్టినరోజున పుట్టిన పిల్లలందరికీ బంగారు ఉంగరం ఇవ్వాలని నిర్ణయించాం'' అని రాష్ట్ర మత్స్య, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్‌ మురుగన్‌ తెలిపారు. ప్రధాని పుట్టినరోజు నాడు పుట్టిన చిన్నారులకు ఈ కానుకలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక్కో ఉంగరానికి దాదాపు 2-గ్రాముల బంగారం ఉంటుందని, అంటే దాని విలువ దాదాపు ఐదు వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 17 వ తేదీన తాము ఉంగరాలు పంచాలి అనుకున్న నిర్దిష్ట ఆసుపత్రిలో 10-15 ప్రసవాలు జరగనున్నట్లు పార్టీ స్థానిక విభాగం అంచనా వేసిందని తెలిపారు.

మోడీ పుట్టినరోజు కానుక .. ఉచిత పథకం కాదు.. ఉచిత చేపల పంపిణీ చేస్తామన్న మంత్రి

మోడీ పుట్టినరోజు కానుక .. ఉచిత పథకం కాదు.. ఉచిత చేపల పంపిణీ చేస్తామన్న మంత్రి

ఇది ఉచిత పథకం కాదని, ఆ రోజున జన్మించిన శిశువులను స్వాగతించడం ద్వారా తాము ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని పుట్టినరోజును జరుపుకుంటామని మంత్రి మురుగన్ తెలిపారు. అంతేకాదు తాము ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా 720 కిలోల చేపలను ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నామని మత్స్య శాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం చేపల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మేము దానిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

720 కిలోల చేపలను పంచాలని నిర్ణయం అందుకే

720 కిలోల చేపలను పంచాలని నిర్ణయం అందుకే


అయితే, ప్రధాని శాఖాహారి అని తమకు తెలుసని మత్స్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీకి 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న కారణంగా ప్రజలకు 720 కిలోల చేపలను పంచాలని నిర్ణయించుకున్నామన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని స్థానిక పరిశుభ్రత దినంగా కూడా గుర్తిస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజును అందరూ మంచి కార్యక్రమాలతో జరుపుకోవాలని సూచించారు.

ప్రధాని మోడీ పుట్టినరోజు సేవా పఖ్వాడాగా నిర్వహించనున్న బీజేపీ

ప్రధాని మోడీ పుట్టినరోజు సేవా పఖ్వాడాగా నిర్వహించనున్న బీజేపీ


ఇదిలా ఉంటే బీజేపీ అధినాయకత్వం ప్రధాని మోడీ జన్మదినాన్ని గత సంవత్సరాల్లో నిర్వహించిన కార్యక్రమాల మాదిరిగానే ఘనంగా నిర్వహించాలని సూచించింది. ఈ వేడుకను 'సేవా పఖ్వాడా'గా గుర్తించాలని అన్ని రాష్ట్రాలను కోరారు. దీని కింద, ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే కార్యకలాపాలలో రక్తదానం మరియు ఇతర వైద్య పరీక్షల శిబిరాలు ఉంటాయి. కేక్‌లు కట్‌ చేయరాదని పార్టీ అధినాయకత్వం గట్టిగా కోరింది. దీంతో దక్షిణాది రాష్ట్రం అయిన తమిళనాడు మాత్రం ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

English summary
TamilNadu BJP has decided to gift gold rings to girls born on PM Modi's birthday. Fisheries Minister L Murugan has announced gold rings will be given to newborn babies tomorrow at RSRM Hospital in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X