Social media: ఆంటీ, అంకుల్ స్కెచ్, సంసారుల స్ట్రీట్ లో ఏం చేశారంటే, దెబ్బకు హడల్ !
చెన్నై/ టీ. నగర్: ఆ ప్రాంతం మొత్తం సంసారాలు చేస్తూ ఓ హోదాలో ఉంటున్న వారు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్లు, ఖరీదైన ఇళ్లు నిర్మించుకుని కుటుంబ సభ్యులతో కాపురం ఉంటున్నారు. సంసారం చేసే మహిళలు, చదువుకునే యువతీ యువకులతో ఆ కాలనీ ఇంత కాలం ప్రశాంతంగా ఉండేది. ఆ కాలనీలోకి ఓ ఆంటీ, అంకుల్ ఎంట్రీ ఇచ్చారు. తాము దంపతులకు అని, ఈమె మా అమ్మాయి అంటూ పరిచయం చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అంతే సంసారులు ఉండే స్ట్రీట్ లో అసలు కథ మొదలు కావడం, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ కాలనీలో కలకలం రేపింది.
Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !

ఖరీదైన కాలనీ
చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలోని రాయల్ నగర్ ప్రాంతంలో ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు, చాలా మంది శ్రీమంతులు మంచి మంచి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. చాలా మంది అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. రాయల్ నగర్ లో సంసారం చేసే మహిళలు, చదువుకునే అమ్మాయిలు వారి వారి పనులు చేసుకుంటూ చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు.

ఆంటీ అంకుల్ ఎంట్రీ
చెన్నైలోని విరుగంబక్కంకు చెందిన ఆనంద్, భువన అనే జంట అద్దె ఇళ్లు కావాలని రాయల్ నగర్ లో తిరిగారు. తాము ఇద్దరు భార్యభర్తలు అని, మేము ఉండటానికి మంచి ఇళ్లు కావాలని ఆ ప్రాంతంలో తిరిగారు. రాయల్ నగర్ 3వ మెయిన్ రోడ్డులోని ఓ ఇల్లు అద్దెకు కావాలని దంపతులు అడిగారు. ఆనంద్, భువన చూడటానికి టిప్పుటాప్ గా ఉండటంతో ఇల్లు అద్దెకు ఇవ్వడాని ఆ ఇంటి యజమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈమె మా అమ్మాయి
అద్దె ఇంటిలో చేరిన ఆనంద్, భువన కొంతకాలం తరువాత ఓ అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చారు. ఈమె మా అమ్మాయి, కాలేజ్ లో చదువుకుంటోందని చుట్టుపక్కల వాళ్లను నమ్మించారు. అంతే అమ్మాయి ఇంటికి వచ్చిన తరువాత ఆ ఇంటికి అనేక మంది మహానుభావులు వచ్చి వెళ్లడంతో ఆ ఇంట్లో సందడే సందడి అంటూ కిక్కిరిసిపోయింది.

ఏదో జరుగుతోంది ?, ఏమిటి ఛప్మా
ఎవడు పడితే వాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చి వెలుతున్నారు ? అంటూ స్థానికులను అనుమానం వచ్చి ఆరా తీశారు. వాళ్లు మా బంధువులు అంటూ ఆనంద్, భువన కొంతకాలం చుట్టుపక్కల వాళ్లను నమ్మించారు. బంధువులు వచ్చి వెళ్లడానికి వేళాపాళలేదా, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది ?, ఏం జరుగుతోంది ? అంటూ స్థానికులకు అనుమానం పెరిగిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మంచి మసాలా సీన్ చూసిన పోలీసులు
ఆనంద్, భువన నివాసం ఉంటున్న ఇంటిలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అంతే ఇంట్లోని ఓ బెడ్ రూమ్ లో యువతితో ఇద్దరు వ్యక్తులు మంచి మూడ్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంట్రీతో మరి కొందరు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

నేను వాళ్ల కూతురే కాదు సార్
దంపతులు అని నమ్మించిన ఆనంద్ అంకుల్, భువన ఆంటీ గుట్టుచప్పుడు కాకుండా అద్దె ఇంటిని తీసుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు అన్నారు. తాను వాళ్ల కూతురే కాదని, నాతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పట్టుబడిన యువతి పోలీసులకు చెప్పింది. బాధితురాలైన యువతిని రక్షించిన పోలీసులు ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

సోషల్ మీడియా... యాప్ తో బుకింగ్.... టెక్నాలజీ ఎఫెక్ట్
సోషల్ మీడియాలో, ఒక యాప్ లో సీక్రెట్ గా విటులను, అమ్మాయిలను బుక్ చేసుకుని ఆనంద్, భువన ఆంటీ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. సంసారులు ఉండే స్ట్రీట్ లో, రాయల్ నగర్ లో హైటెక్ వ్యభిచార కేంద్రం గుట్టురట్టు అయ్యిందని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైటెక్ సెక్స్ రాకెట్ దందా నిర్వహించిన ఆనంద్, భువన ఆంటీ జైలుపాలైనారు.