చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: ఆంధ్రా అమ్మాయి, చెన్నై అబ్బాయి, ఏడాది క్రితం ?, ఉద్యోగానికి వెళ్లి వచ్చి చూస్తే, అసలు ఏం జరిగింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరుపతి: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి అతనితో సంతోషంగా కాపురం చెయ్యాలని అనుకుంది. పొరుగు రాష్ట్రంలో ఉన్న భర్త ఇంటికి వెళ్లిన ఆమె అతనితో హ్యాపీగా జీవనం సాగిస్తోంది. వివాహం జరిగిన కొంతకాలం తరువాత దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఉండే సమస్యే కదా అంటూ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

రాత్రి కూడా దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే భర్త ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే మా అమ్మాయిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!

ఆంధ్రా అమ్మాయి..... చెన్నై అబ్బాయి

ఆంధ్రా అమ్మాయి..... చెన్నై అబ్బాయి

చెన్నైలోని తిరువెర్కాడ్ ప్రాంతంలోని కనకదుర్గ రోడ్డులో హరిబాబు అలియాస్ హరి (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది మొదట్లో ఆంధ్రప్రదేశ్ లోచి అప్పటి చిత్తూరు జిల్లాకు చెందిన జయంతి అలియాస్ జయ (21) అనే యువతికి హరిబాబు వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు.

సంతోషంగా కాపురం పెట్టారు

సంతోషంగా కాపురం పెట్టారు

హరిబాబు, జయంతి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. చెన్నైలోని భర్త హరిబాబు ఇంటికి చేరుకున్న జంయతి అతనితో సంతోషంగా కాపురం చేస్తోంది. హరిబాబు చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

దంపతుల మధ్య గొడవలు

దంపతుల మధ్య గొడవలు

కుటుంబ సభ్యులు చూపించిన హరిబాబును పెళ్లి చేసుకున్న జయంతి అతనితో సంతోషంగా కాపురం చెయ్యాలని అనుకుంది. వివాహం జరిగిన కొంతకాలం తరువాత హరిబాబు, జయంతి దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఉండే సమస్యే కదా అంటూ పెద్దలు కూడా జయంతి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.

ఉరి వేసుకున్న భార్య

ఉరి వేసుకున్న భార్య

రానురాను హరిబాబు, జయంతి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి కూడా జయంతి, హరిబాబు దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే జయంతి భర్త హరిబాబు ఉద్యోగం చెయ్యడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తరువాత ఇంట్లో ఒంటరిగా ఉన్న జయంతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పెళ్లి చేసి రెండేళ్లు కూడా కాలేదు

పెళ్లి చేసి రెండేళ్లు కూడా కాలేదు

అయితే మా అమ్మాయి జయంతిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. జయంతి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడంలేదని, కేసు విచారణలో ఉందని చెన్నైలోని తిరువెర్కాడ్ పోలీసులు తెలిపారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే జయంతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

English summary
Wife: Misunderstanding with husband, Andhra Pradesh girl commits suicide by hanging in Chennai city in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X