Wife:అమెరికాలో భర్త స్కెచ్, ఊర్లో భార్య దారుణ హత్య, రోబో నటుడి బంధువు, సీక్రెట్స్, సినిమా స్టైల్లో!
చెన్నై: రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేశారు. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టారు. అమెరికాలోనే అమ్మాయి పుట్టింది. భర్త చిత్రహింసలు తట్టుకోలేక భార్య సొంత ఊరికి వచ్చేసింది. అమెరికా నుంచి భర్త అతని భార్యకు నరకం చూపించాడు. ఇదే సమయంలో భార్యకు తపాలా కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. మొగుడి టార్చర్ తట్టుకోలేని భార్య అమెరికాలో ఉన్న భర్తకు విడాకుల నోటీసులు పంపించింది.
భర్త ఉద్యోగానికి ఎసరు రావడంతో అతను బంధువులతో కలిసి భార్య హత్యకు స్కెచ్ వేశాడు. అమెరికాలో కుర్చుని ఆన్ లైన్ లో హత్యకు ప్లాన్ చెప్పిన భర్త అతని భార్యను అతిదారుణంగా చంపించి దానికి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం కలకలం రేపింది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హస్య నటుడిగా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఫేమ్ గా గుర్తింపు తెచ్చుకున్న సంతానం సమీప బంధువు హత్యకు గురి కావడం కలలకం రేపింది. ఏదో చెయ్యాలని ప్రయత్నించి ఏదేదో అయిపోవడంతో అమెరికాలో ఉన్న భర్తకు సినిమా కనపడుతోంది.
Aunty: అత్తా VS కోడలు, బెడ్ రూమ్ లో జాకెట్ తో ?, భర్త ఫుల్ సపోర్ట్, పడక సుఖం కోసం కొడుకు?

అమెరికాలో ఉద్యోగం
తమిళనాడులోని తిరువరూర్ సమీపంలోని కిడారి కొండం ప్రాంతంలో నివాసం ఉంటున్న చిదంబరం కుమార్తె జయభారతి, తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంోని విష్ణుప్రకాష్ అనే యువకుడికి 2016లో గ్రాండ్ గా పెళ్లి చేశారు. విష్ణుప్రకాష్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని జయభారతి కుటుంబ సభ్యులు అతనికి భారీ మొత్తంలో బంగారు నగలు, కట్నం కింద నగదు ఇచ్చారని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఫేమ్ గా గుర్తింపు తెచ్చుకున్న సంతానం సమీప బంధువు ఈ జయభారతి.

అమెరికాలో పాప పుట్టింది
వివాహం జరిగిన తరువాత కొంతకాలం తమిళనాడులో ఉన్న విష్ణుప్రకాష్ తరువాత భార్య జయభారతితో కలిసి అమెరికాలోని వర్జీనియాకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేశాడు. అమెరికాలోనే విష్ణుప్రకాష్, జయభారతి దంపతులకు ఓ పాప పుట్టింది. పాప పుట్టిన తరువాత విష్ణుప్రకాష్ భార్య జయభారతి, కుమార్తెతో కలిసి సంతోషంగానే ఉన్నాడని సమాచారం. తరువాత విష్ణుప్రకాష్ అతని అసలు స్వరూపం బయటపెట్టాడు.

ఏదో జరిగింది ? అందుకే అనుమానం
అమెరికాలో భర్త విష్ణుప్రకాష్ భార్య జయభారతి మీద అనుమానంతో రానురాను టార్చర్ పెడుతూ ఆమెకు సినిమా చూపించాడు. భర్త టార్చర్ తట్టుకోలేక అతి కష్టం మీద జయభారతి కుమార్తెను తీసుకుని తమిళనాడులోని సొంత ఊరికి వచ్చేసింది. తరువాత జయభారతి తన భర్త విష్ణుప్రకాష్ టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ కుంభకోణం పోలీసులకు, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి, తమిళనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.

విడాకుల నోటీసులతో ఉద్యోగానికి ఎసరు
50 రోజుల క్రితం జయభారతి ఆమె తల్లిదండ్రుల అనుమతితో అమెరికాలో ఉంటున్న భర్త విష్ణుప్రకాష్ కు విడాకుల నోటీసులు పంపించింది. విడాకుల నోటీసులు ఇస్తే తనకు అమెరికాలో ఉద్యోగం పోతుందని, వెంటనే విడాకుల నోటీసులు ఉపసంహరించుకోవాలని అమెరికా నుంచి భర్త విష్ణుప్రకాష్, తమిళనాడులోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి భార్య జయభారతి, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం మొదలుపెట్టారు. అయితే జయభారతి మాత్రం ఆమె భర్త నుంచి విడిపోవాలని డిసైడ్ అయ్యింది.

భార్యకు ఉద్యోగం..... పక్కా స్కెచ్ తో హత్య
భర్తకు విడాకుల నోటీసులు ఇచ్చిన వారం రోజుల్లోనే జయభారతికి తప్పలంబులియూరు గ్రామంలో తపాలా కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. ఈనెల 23వ తేదీన పోస్టాఫీసులో ఉద్యోగం ముగించుకుని ఆక్టీవాలో జయభారతి ఇంటికి బయలుదేరింది. తిరవరూరు సమీపంలో వేగంగా వచ్చిన కారు జయభారతి స్కూటర్ ను ఢీకొడంతో అమె అక్కడిక్కడే మరణించిందని తిరువూరు గ్రామీణ పోలీసులు అమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
అయితే జయభారతిని హత్య చేసి ఉంటారనే అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

కారుతో పదేపదే తొక్కించి దారుణ హత్య
ఇంటికి వెలుతున్న జయభారతి స్కూటర్ ను ఢీకొట్టిన కారు అనేకసార్లు వెనక్కి ముందుకు ఆమె మీద నడపం వలనే ఆమె ప్రాణాలు పోయాయని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో కారు నెంబర్ ఆధారంగా కేసు విచారణ చేశారు. తిరువారూరు సమీపంలో నివాసం ఉంటున్న రాజా అనే వ్యక్తి కారు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
రాజాను విచారణ చెయ్యగా మూడు రోజుల క్రితం తన బావమరిది జగన్ ఈ కారును తీసుకున్నాడని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు జగన్ పట్టుకోవడంతో కథ మలుపు తిరిగింది.

భర్త బందువే హంతకుడు
అమెరికాలో ఉంటున్న భర్త విష్ణుప్రకాష్ జగన్ సమీప బంధువు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమెరికాలో కుర్చున్న భర్త విష్ణుప్రకాష్ అతని ఉద్యోగం కాపాడుకోవడం కోసం తమిళనాడులో ఉన్న బంధువుతో కలిసి భార్య జయభారతి హత్యకు స్కెచ్ వేశాడని జగన్ పోలీసుల విచారణలో అంగీకరించడాని తెలిసింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సహాయంతో విష్ణుప్రకాష్ ను తమిళనాడుకు రప్పించడానికి తిరువారూర్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రముఖ నటుడి బంధువు
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంతానం సమీప బంధువు హత్యకు గురైన జయభారతి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఫేమ్ గా సంతానం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక సినిమాల్లో లీడ్ రోడ్ లో నటించడమే కాకుండా సంతానం హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు.
జయభారతికి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో అమెరికాలో ఉన్న విష్ణుప్రసాద్ కు ఇప్పుడే కింద తడిపోయింది. జయభారతి హత్య కేసులో జగన్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి భార్య హత్యకు స్కెచ్ వేసి పక్కాప్లాన్ తో ఆమెను చంపించడం తమిళనాడులో కలకలం రేపింది.