ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తిరుపతి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
ప్రపంచ ప్రసిద్ది గాంచిన పుణ్య క్షేత్రం తిరుపతి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. తిరుపతి కార్పోరేషన్ తో పూర్తిగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. ప్రముఖ సినీ నటుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తిరుపతిలో ఒకసారి, గుడివాడ లో రెండు సార్లు, హిందూపూర్‌లో మూడు సార్లు, టెక్కలి లో ఒకసారి, నల్గొండ లో ఒకసారి గెలుపొందారు. తిరుప తిలో రెండు సార్లు గెలిచిన నాదముని రెడ్డి, పుత్తూరు లో ఒకసారి గెలిచిన రాజశేఖర రెడ్డి తండ్రి..కొడుకులు. రెండు సార్లు తిరుపతిలో గెలిచిన అగరాల ఈశ్వరరెడ్డి కొద్ది కాలం శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. టిడిపి..ప్రజారాజ్యం ఇద్దరు వ్యవస్థాపక అధ్యక్షుడు సినీ రంగం నుండి వచ్చిన వారే. తొలి సారి తిరుపతి నుండి పోటీ చేసిన వారే కావటం విశేషం.
15 సార్లు ఎన్నికలు..
తిరుపతి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయి దు సార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి గెలుపొందాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అదే ఎన్నికల్లో తన సొంత జిల్లాలోని పాలకొల్లు నుండి సైతం పోటీ చేసారు. అయితే అక్కడ ఓడిన చిరంజీవి తిరుపతిలో గెలిచారు. తదనంతర పరిణామాల్లో ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో..ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేసారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి కరుణాకర రెడ్డి గెలుపొందారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి నియోకవర్గం లో మొత్తం 290107 ఓట్లు ఉండగా, అందులో171507 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వెంకటరమణ కు 99313 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కరుణాకరరెడ్డికి 57774 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి వెంకటరమణ 41539 ఓట్ల మెజార్టీతో గెలపొందారు. అయితే, ఎన్నికైన కొద్ద కాలానికే వెంకటరమణ అనారోగ్యంతో మరణించారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ టిడిపి నుండి పోటీ చేసారు. వైసిపి పోటీ పెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్ది పై సుగుణమ్మ 116524 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
వచ్చే ఎన్నికల్లో..
ఇక, వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ కు తిరిగి సీటు ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. టిడిపి నుండి ఔత్సాహికుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక, వైసిపి నుండి తిరిగి భూమన కరుణాకర రెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ప్రజారాజ్యం అధినేత..తన అన్నయ్య చిరంజీవి గెలిచిన నియోజకవర్గం కావటంతో ఇదే నియోజకవర్గంలో జనసేన బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. హరిప్రసాద్ పేరు ఇక్కడ ప్రముఖంగా ప్రచారంలో ఉంది. దీంతో..ఇక్కడ త్రిముఖ పోరు తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications