చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రుయా'కి పద్మజ-పురుషోత్తం... కేకలు,అరుపులతో జైల్లో హడల్.. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా మిస్టరీగానే...

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులు పద్మజ,పురుషోత్తమ నాయుడులను పోలీసులు తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని... వారికి చికిత్స అవసరమని వైద్యులు ఇచ్చిన నివేదిక మేరకు ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం(జనవరి 29) ఉదయం ప్రభుత్వ ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు జైల్లో పద్మజ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తోటి ఖైదీలను,అధికారులను హడలెత్తించినట్లు తెలుస్తోంది.

పిచ్చి రాతలు,ప్రేలాపనలు...

పిచ్చి రాతలు,ప్రేలాపనలు...

గత మూడు రోజులుగా పద్మజ,పురుషోత్తమ నాయుడు మదనపల్లె సబ్‌ జైల్లో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో పద్మజ తనను అందరితో పాటే మహిళా బ్యారక్‌‌లో ఉంచాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఎవరికీ ఇబ్బంది కలిగించనని ఆమె తోటి ఖైదీలతో చెప్పారట. బుధవారం అందరితో కలిసి భోజనం చేసి రాత్రంతా శివ నామస్మరణతోనే గడిపినట్లు తెలుస్తోంది. అయితే జైలు గోడలపై పిచ్చి రాతలు రాయడం,ఏవేవో ప్రేలాపనలు చేయడంతో తోటి ఖైదీలు హడలిపోయినట్లు తెలుస్తోంది.

కేకలతో హడలెత్తించిన పద్మజ...

కేకలతో హడలెత్తించిన పద్మజ...


గురువారం పద్మజను ప్రత్యేక బ్యారక్‌కు మార్చి... కాపలాగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాత్రి జైల్లో ఖైదీలంతా నిద్రపోతున్న సమయంలో పద్మజ బిగ్గరగా కేకలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు,సిబ్బంది హడలిపోయినట్లు చెప్తున్నారు. వెంటనే జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ ప్రభుత్వ ఆస్పత్రికి మానసిక వైద్యురాలు రాధికను పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు. పద్మజ మానసిక స్థితి సరిగా లేదని వైద్యురాలు చెప్పడంతో ఆమెతో పాటు ఆమె భర్త పురుషోత్తం నాయుడును తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఆ వ్యక్తి ఎవరు...?

ఆ వ్యక్తి ఎవరు...?

పునర్జన్మలపై నమ్మకం,మూఢ విశ్వాసాలే అలేఖ్య,సాయిదివ్యల హత్యలకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పద్మజ-పురుషోత్తంల ఇంటికి వచ్చిన మాంత్రికుడు సుబ్బరామయ్యను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 23న ఆ ఇంటికి వెళ్లి వారికి తాయెత్తులు,రుద్రాక్షలు కట్టినట్లు సుబ్బారామయ్య పోలీసుల విచారణలో చెప్పాడు. అంతేకాదు, ఆ సమయంలో మరో వ్యక్తి ఎవరో అలేఖ్య చెవిలో శంకం ఊదడాన్ని గమనించినట్లు చెప్పాడు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తేలలేదు.

ఆ ఇద్దరు ఏమయ్యారు...?

ఆ ఇద్దరు ఏమయ్యారు...?

సాయిచిత్ర భాస్కర్,రాజు అనే ఇద్దరు తనను సంప్రదించి ఆ ఇంటికి తీసుకెళ్లినట్లు సుబ్బరామయ్య వెల్లడించాడు. అయితే హత్యల తర్వాత ఆ ఇద్దరూ కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అలేఖ్య పాత్రే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్‌లో ఆధ్యాత్మికత,ఆత్మలు,పునర్జన్మలకు సంబంధించి ఏవేవో పుస్తకాలు చదివిన ఆమె... వాటిని అమలుచేసేందుకు తన చెల్లెలు సాయిదివ్యనే ప్రయోగశాలగా మార్చుకుందన్న వాదన వినిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా అలేఖ్య మాటలు నమ్మి అందులో కూరుకుపోయారని అంటున్నారు. అయితే ఈ దారుణాల వెనుక బయటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం మాత్రం వెంటాడుతోంది.

English summary
Padmaja and Purushottama Naidu, accused in the twin murder case in Madanapalle, Chittoor district, have been shifted to Ruya Hospital in Tirupati by the police. The two were admitted to the hospital as per the report given by the doctors that they were not in a good mental condition and needed treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X