విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య

చిత్తూరు: అమెరికాలో ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

తెలుగు టెక్కీ గుమ్మడికాయల ద్వరకానాథ్ రెడ్డి అమెరికాలోని అమెజాన్ సంస్థలో పనిచేస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఆయన గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

telugu techie dwarakanath allegedly commits suicide in america

అయితే ద్వారకానాథ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. ఆయనకు భార్య కళ్యాణితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ద్వారకానాథ్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు లేవని ఆయన బంధువులు చెబుతున్నారు.

ద్వారకానాథ్ మరణంతో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ద్వారకానాథ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మంచి ఉద్యోగం, కుటుంబంతో సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఆయన మరణం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+