వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవినేని కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మరియు అక్రమ కేసుల్లో నిందితులుగా ఉన్న కార్యకర్తల కుటుంబాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు,ఎంపీ కేశినేని నాని మరియు ఇతర నాయకులు పరామర్శించారు. అంతకుముందు చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ దళిత నాయకులు ప్రయత్నించారు. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద దళిత వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకోగా అక్కడ పోలీసుల బలగాలు కూడా మోహరించాయి.

Covid cases on a slight rise in india,Kamal preet kaur enters finals at tokyo olympics live updates
Covid cases on a slight rise in india,Kamal preet kaur enters finals at tokyo olympics live updates

Newest First Oldest First
4:14 PM, 31 Jul

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మరియు అక్రమ కేసుల్లో నిందితులుగా ఉన్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు,ఎంపీ కేశినేని నాని మరియు ఇతర నాయకులు
1:39 PM, 31 Jul

భారతదేశంలో రెడీమేడ్‌ వస్త్రాల తయారీలో పేరుగాంచిన గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ అపారెల్ పార్కులో నిర్మించ తలపెట్టిన అపారెల్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండి సుమీర్ హిందూజా, చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి. నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అపారెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా, అందులో ఎక్కువ శాతం మహిళలు లబ్ధి పొందనున్నారు.
12:01 PM, 31 Jul

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పరామర్శించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.
11:45 AM, 31 Jul

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నసీమా బేగం అనే మహిళ రైలు ఎక్కుతూ కాలు జారి పడింది.ఇది గమనించిర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ కానిస్టేబుల్ దినేష్ సింగ్ ఆమెను కాపాడారు.
11:27 AM, 31 Jul

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శేట్ పల్లి గ్రామంలో ఆషాడం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం పురస్కరించుకొని ఒక సామాజిక వర్గం చొప్పున గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తుంటారు. ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మట్టి కుండలో నైవేద్యాన్ని తీసుకొని తలపై బోనం పెట్టుకొని మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. వృద్ధులు యువకులు డప్పు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ బోనాల ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కరోనా వైరస్ బారి నుంచి దేశాన్ని రక్షించాలని అమ్మవారికి బోనం సమర్పించినట్లు తెలిపారు
11:05 AM, 31 Jul

కడప జిల్లా రాజంపేటలోని మన్నూరు రూరల్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఎల్లాగడ్డ గ్రామంలో పేకాట శిబిరం పై దాడి చేశారు. పేకాట జూదం ఆడుతున్న వారినుంచి రూ.5060 నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు ఎస్సై రోషన్
10:41 AM, 31 Jul

వచ్చేవారం సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు

వచ్చేవారంలో సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వాహణాధికారి సన్యం భరద్వాజ్ వెల్లడించారు
10:28 AM, 31 Jul

హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్ -మనాలి నేషనల్ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
10:27 AM, 31 Jul

మిజోరాం పేలుళ్ల కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఎన్‌ఐఏ. జూలై 26వ తేదీన కేసును స్వీకరించింది

English summary
There was a sligt increase in Corona positive cases.In Tokyo olympics 2020, Indian Discuss thrower Kamal preet kaur enters semi finals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X