• search
  • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ రాజకీయంగా ఓడినా..అక్కడ మెగా బ్రదర్స్ అంటే : వారిని మించిపోయేలా.. ఈ సీన్ చూస్తే..!

|

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసారు. గాజువాక తో పాటుగా సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం నుండి జనసేన అదినేత అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయంగా ఓడినా..అక్కడ మెగా బ్రదర్స్ కు ఉన్న ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 2009 ఎన్నికల్లో ఇదే జిల్లా పాలకొల్లు నుండి చిరంజీవి సైతం ఓడిపోయారు. కానీ, సినీ హీరోగా మాత్రం చిరంజీవి పైన ఇప్పటికీ అదే అభిమానం.

సైరా సక్సెస్ కోసం : యాదాద్రిలో పూజలు చేసిన చిరంజీవి సతీమణి సురేఖ

భీమవరంలో కొద్ది కాలం ఉన్న రెండు ప్రధాన వర్గాల అభిమానుల మధ్య పోటీ నెలకొని ఉంది. తాజగా ఒక హీరోకు చెందిన భారీ ఫ్లెక్సీని ఆ వర్గం వారు ఏర్పాటు చేస్తే..ఇప్పుడు చిరంజీవి మద్దతు దారులు సైరా సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ భారీ ఫ్లెక్సీ సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. దీనిని మెగా అభిమానులు ఆసక్తగా తిలకిస్తున్నారు. అందునా భీమవరంలో ఇది ఏర్పాటు కావటంతో రాజకీయంగానూ ఇది ఆసక్తి కరంగా మారుతోంది.

A huge flexi creating interest in Bhimavaram arranged by chiranjeevi fans on the occasion of Sye Raa Release

భీమవరంలో కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ హీరో సినిమా విడుదల అయింది. ఆ సమయంలో ఆ హీరో అభిమానులు..అక్కడ ఎక్కువగా కనిపించే ఒక సామాజిక వర్గానికి చెందిన వారి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. దీని పైన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు అర కిలో మీటరు పొడుగు ఉండేలా ఆ హీరో బొమ్మలతో దానిని ఏర్పాటు చేసారు. కొద్ది కాలంగా ఇదే సినీ అభిమానం అక్కడ రెండు వర్గాలకు చెందిన సినీ అభిమానుల మధ్య చిన్నపాటి విభేదాలకు కారణమైంది.

అయితే..ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో ఆ తరువాత అవి సమిసిపోయాయి. ఇక, ఆ హీరో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పోటీగా ఇప్పుడు చిరంజీవి సినిమా సైరా విడుదల పేరుతో మెగా బ్రదర్స్ అభిమానులు అంత కంటే పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. ఆ ప్లెక్సీ పైన తమ ఊరి పేరుతో పాటుగా తమ వర్గం పేరును ప్రస్తావించారు. అక్టోబర్ రెండున చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం సైరా విడుదల కానుంది. దీని ప్రమోషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. చిరంజీవి తనయుడు రాం చరణ్ చిత్ర నిర్మాతగా ఉన్నారు.

ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రాంలో ఈ భారీ ఫ్లెక్సీ వీడియో హల్ చల్ చేస్తోంది. దీనిని మెగా అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏపీలో ఎక్కువగా ఉండే చిరంజీవి అభిమానులు ఈ సినిమా విడుదలను పండుగగా చేసుకుంటున్నారు. ఇక, రాజకీయంగా ఇదే జిల్లాలో జనసేనకు దెబ్బ తగిలినా..సినిమా అభిమానుల్లో మాత్రం వారి మీద ఆదరణ ఎక్కడా తగ్గినట్లు కనిపించటం లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A huge flexi creating interest in Bhimvaram arranged by chiranjeevi fans on the occassion of Syra Release.it seem to be nearly half kilo meter this flexi is arranged with syra pictures. Politically in recent elections pawan lost in Bhimavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more