దిశ ఘటన మరువక ముందే మరో గ్యాంగ్ రేప్... తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు గొంతెత్తి నినదిస్తోంది.మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ఇలాంటి ఘటనకు పాల్పడిన నేరస్తులను వెంటనే శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తోంది యావత్ దేశం.
దిశ హత్యకేసు .. తల్లిదండ్రులు మారండి .. మగపిల్లలపై దృష్టి పెట్టండి : హరీష్ రావు

తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్,హత్య
మహిళలకు రక్షణ కల్పిస్తామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.ఇక తాజాగా 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.తూర్పుగోదావరి జిల్లాలోని జీ.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు.

గ్యాంగ్ రేప్ చేసి చంపిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ , ఇద్దరు పరారీ
భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్న క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిసున్నారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.

షాద్ నగర్ దిశా ఘటన మరువకముందే మరో ఘటన
నిన్నటికి నిన్న షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నేరస్తుల పై దేశం భగ్గుమంటుంది. ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంది. అలాంటి వారిని ప్రాణాలతో ఉంచితే సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తారని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కాకముందే మరో ఘటన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తెలుగు రాష్ట్రాలలో ఆందోళనకరంగా అత్యాచారాలు, హత్యలు
ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న 50 ఏళ్ల మహిళ సామూహిక అత్యాచారం, హత్య ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా, నిందితులకు మరణ దండన విధించినా నేరప్రవృత్తి ఉన్న వారిలో మార్పు వచ్చేలా మాత్రం కనిపించటంలేదు. అందుకు ఉదాహరణ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అత్యాచారం, హత్య ఘటన. ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం కావటం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!