పడవ ప్రమాదంపై జగన్ సీరియస్, బాధగా ఉందంటూ.. క్లియర్ కట్ ఆదేశాలు: మృతులకు 10లక్షల పరిహారం
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర జరిగిన ఘోర పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులకు హెచ్చరిక
ఇలాంటి పడవ ప్రమాదం జరగకుండా చేయగలిగితేనే ప్రయోజనం ఉంటుందని, లేదంటే.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం హెచ్చరించారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏడాదికోసారి కాదు..
పర్యాటక బోట్లను నడిపే ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. లైసెన్సులు ఇచ్చి ఏడాదికోసారి కాకుండా నెలకోసారి బోట్లలో తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రక్షణ ప్రమాణాలను పాటించని బోట్లకు అనుమతివ్వకూడదని స్పష్టం చేశారు. ఆ ప్రమాణాలను సంబంధిత అధికారులు రూపొందించాలని అన్నారు.

బాధకు గురిచేసింది..
ప్రైవేటు బోట్లపై అజమాయిషీ చేయలేనప్పుడు.. వాటన్నిటినీ రద్దు చేసి.. ప్రభుత్వ బోట్లనే నడపండి అని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాణం విలువ మనం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒక ఏడాది పాప, ఆమె తండ్రి ఈ ప్రమాదంలో చనిపోయారు.. ఆ పాప తల్లి మాత్రం బతికి ఉంది. ఏం చేయాలో తెలియక ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని చెప్పారు. ఈ ఘటన తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు
పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ. 10లక్షలు, గాయపడిన వారికి రూ. 3లక్షలు, పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మనం తప్పు చేశాం కాబట్టే ఈ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఈ ప్రమాద ఘటనపై కమిటీ కూడా వేస్తున్నామని తెలిపారు.

అధికారులకు ఆదేశాలు..
ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రయాణికులు ఎంతమంది.. వారిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.. ఎంతమంది గల్లంతయ్యారనే వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు మృత దేహాలను బయటకి తీసే పనిలో ఉన్నాయని తెలిపారు.

9మంది మృతి.. 24మంది గల్లంతు..
ఇప్పటి వరకు 27మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలినవారి కోసం బృందాలుగా ఏర్పాడి బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం బోటులోని 60 మందిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు దొరికాయి. 24మంది గల్లంతయ్యారు. 27మంది ప్రమాదం నుంచి బటయపడ్డారు.

బాధితులకు పరామర్శ..
కాగా, అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చలూరు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అండగా ఉంటామని బాధితులకు జగన్ భరోసా ఇచ్చారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications