టీడీపీ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు సిట్: నిజాలు నిగ్గు తేల్చేలా

కాకినాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో గొల్లలగుంట ఘటనపై జగన్ సర్కార్ స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయదలిచిన సబ్బెళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్.. అనంతరం ఆయన ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించిన ఘటనల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందంటూ తెలుగుదేశం నేతలు విమర్శిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి గొల్లలగుంటలో ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గొల్లలగుంటకు వెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్సీపీ.. తమ పార్టీ నేతలను చూసి వణికిపోతోందని, భయాందోళనలకు గురి చేస్తోందంటూ నారా లోకేష్ విమర్శించారు.

Recommended Video

    #Eastgodavari టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త మృతి కేసులో సిట్ విచారణ
    AP govt appoints Sit to investigate East Godavari incident

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా గొల్లలగుంటకు వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ శ్రీనివాస్ రెడ్డి గానీ, ఆయన భార్య పుష్పవతి గానీ పోలీసులు ఫిర్యాదు చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొందరు వ్యక్తులు తనకు మత్తు మందు ఇచ్చారని, కాళ్లు, చేతులు కట్టేసి ఊరికి దూరంగా వదిలి పెట్టారంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆయన కాండ్రేగుల గ్రామం శివార్లలో పొలంలో ఉరి వేసుకొన్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. ఈ ఘటన పట్లు పలు అనుమానాలు వ్యక్తమౌతోండటం, తెలుగదేశం పార్టీ రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంతో ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సిట్‌ను ఏర్పాటు చేసింది. డీఎస్పీ నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది.

    AP govt appoints Sit to investigate East Godavari incident

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+