జంక్షన్లో బర్త్ డే ఫంక్షన్ ... వైసీపీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలపై ఏపీలో రచ్చ నడిచింది . అంబాజీపేట జంక్షన్ లో నడిరోడ్డు మీద వైసీపీ ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారు పోలీసులు . పుట్టిన రోజు వేడుకలు నడి రోడ్ మీద పెట్టి నానా హంగామా చేసి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ పై కేసు నమోదు కావటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
అధికారం ఉంటే ఏ పనైనా చేయొచ్చు అని భావించి అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు . అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులనే ఇబ్బందికి గురిచేస్తే దాని పర్యవసానం ఎలా వుంటుందో తెలిసోచ్చేలా చేశారు పోలీసులు. ఎమ్మేలేయే కొడుకు అయితే ఏం ఆయనకు ఏమైనా కొమ్ములున్నాయా అని ప్రజలు ఎమ్మెల్యే కొడుకు నడి రోడ్ మీద పుట్టిన రోజు వేడుకలు చేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావటంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

దీంతో పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వికాస్ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా, ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్దంగా రోడ్డుపై పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారని ఎమ్మెల్యే కొడుకు అతని అనుచరులపై అంబాజిపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, 290, సెక్షన్ 32 కింద వారిపై ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. తండ్రికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చెయ్యాలని చూసిన సదరు తనయుడిపై కేసు నమోదు చేసి చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని తేల్చి చెప్పేశారు. ప్రజలకు సేవ చేస్తారని ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, కుమారుల ఆగడాలను కట్టడి చెయ్యాలని లేకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఈ ఉదంతంతో అర్ధం అయ్యేలా చెప్తున్నారు పోలీసు అధికారులు .
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications