Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం

ఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయటకు తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. రాయల్ పున్నమి బోటు కచ్చులూరు వద్ద మునిగిన ప్రమాదంలో ఇప్పటికే 34 మృతదేహాలను వెలికి తీశారు. మరో 13 మంది ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే వారంతా బోటు లోనే చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.

బోటుని బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నేవీ గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు పేర్కొన్నారు. అంత లోతు నుంచి బోటును బయటకి తీయటం సాధ్యం కాదని నేవీ సిబ్బంది చేతులెత్తేశారు. 25 టన్నుల బరువున్న బోటును అంత లోతు నుండి బయటకు తీయడం కష్టం అన్నారు నేవీ సిబ్బంది. ఇక బోటును బయటకు తీయడం కోసం రోప్ ఆపరేషన్ ను కూడా చేశారు. లంగరు సహాయంతో బోట్ ఎక్కడుందో గుర్తించి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.

Recommended Video

    Boat Might Have Gone 315 Meters Deep Into The River || బోటును వెలికి తీయడం చాలా కష్టం || Oneindia
    Uttarakhand State Disaster Technology team finally identified the boat

    ఇక చివరగా సోలార్ సిస్టమ్‌ ద్వారా 70-80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం బోటు ఎక్కడుందో కనిపెట్టి బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా బోటు 70-80 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించడంతో బయటకు తీస్తే బోటు ప్రమాదానికి గురైన మిగతావారి మృతదేహాలు లభ్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+