కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే కారు - నిద్రమత్తులో డ్రైవర్- లాస్ట్ మినిట్ లో !
ఏపీలో ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా..ఆయన కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు.

నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సొంతూరు జంగారెడ్డి గూడెంకు వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ సభ్యులు కారులో వస్తున్నారు. అయితే మార్గమధ్యంలో కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద అనుకోని ఘటన చోటు చేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు కాస్తా రోడ్జు పక్కకు వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ప్రమాదం నుంచి మాత్రం తృటిలో తప్పించుకున్నారు.

ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టగానే అందులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. దీంతో ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు కూడా తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెల్లవారు జాము కావడం, ఎయిర్ బెలూన్లు ఒక్కసారిగా ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే కుటుంబం షాక్ కు గురైంది. అయితే పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంది. వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేసి మరో కార్ తెప్పించారు. దీంతో వారంతా క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు.
కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే కారు - నిద్రమత్తులో డ్రైవర్- లాస్ట్ మినిట్ లో !#andhrapradesh, #eluru, #chitalapudi pic.twitter.com/8Mf0t1hWVm
— oneindiatelugu (@oneindiatelugu) December 20, 2022












Click it and Unblock the Notifications