నాతో వస్తే పవనే సీఎం- బాబుకు వయసైంది-జగన్ ను కలుపుకుపోతా-ఏలూరులో కేఏ పాల్ కామెంట్స్
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇందులోకి దిగారు. నిన్న కాకినాడలో హంగామా చేసి 24 గంటలు గడవక ముందే ఇవాళ ఏలూరుకు చేరుకున్న పాల్.. ఇక్కడ అంతకు మించి హంగామా చేశారు. ఛాయ్ పే చర్చా పెట్టారు. మాస్ ఓటర్లను కలుసుకుంటూ వారితో చిట్ చాట్ చేశారు. అంతే కాదు వారికి ఏపీలో జరుగుతున్న రాజకీయాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏలూరులో కేఏ పాల్
ఇవాళ ఏలూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టూర్ కొనసాగుతోంది. నిన్న కాకినాడతో మొదలుపెట్టిన టూర్ ను ఆయన ఇవాళ ఏలూరులో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏలూరులోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ సాధారణ జనాన్ని కలుసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, పొత్తులు అంటూ సాగుతున్న ఇతర పార్టీల రాజకీయానికి భిన్నంగా.. సాధారణ జనంతో సమావేశమవుతున్నారు. తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఏ జరుగుతుందో వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పాల్ చాయ్ పే చర్చా
ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న కేఏ పాల్.. అక్కడ స్దానికంగా జనాన్ని రీచ్ అయ్యేందుకు ఛాయ్ పే చర్చను సాధనంగా మార్చుకుంటున్నారు. టీ దుకాణాలకు వెళ్లడం, అక్కడున్న జనంతో కాసేపు మాట్లాడటం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, తాను చెప్పాలనుకున్న విషయాల్ని సూటిగా చెప్పేయడం, అక్కడి నుంచి బయలుదేరి మరో ప్రాంతానికి వెళ్లడం.. ఇదే పాల్ దినచర్యగా ఉంది. దీంతో పాల్ ను కలుసుకునేందుకు జనం తరలివస్తున్నారు.
జగన్, బాబు, పవన్ పై పాల్ హాట్ కామెంట్స్
తన
టూర్
లో
భాగంగా
పవన్
కళ్యాణ్
రాష్ట్రంలో
నెలకొన్న
రాజకీయాలపై
స్ధానికులకు
వివరిస్తూనే..
మరోవైపు
తన
వ్యూహాల్ని
కూడా
బయటపెడుతున్నారు.
తమ్ముడు
పవన్
కళ్యాణ్
తనతో
వస్తే
సీఎం
అవుతాడని,
బీజేపీతో
ఉంటే
సీఎం
అవలేడంటూ
పాల్
వ్యాఖ్యానించారు.
అలాగే
చంద్రబాబుకు
వయసు
అయిపోతుందని,
ఇక
కుటుంబ
పాలనను
అంతమోందించాలని
పాల్
కోరారు.
అందరూ
కలిసి
ప్రజాశాంతి
పార్టీని
ఆదరించాలని
కేఏ
పాల్
కోరుతున్నారు.
త్వరలో
అవసరమైతే
సీఎం
జగన్మోహన్
రెడ్డిని
కలిసి
ప్రజాశాంతి
పార్టీతో
కలసి
పని
చేయాలని
ఆహ్వానిస్తానని
కేఏ
పాల్
వెల్లడించారు.