ఏలూరు: మిస్టరీ వ్యాధికి ఒకరు బలి -చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి -హెల్త్ ఎమర్జెన్సీకి డిమాండ్
ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ప్రబలిన వింత వ్యాధి ఒకరిని బలి తీసుకుంది. పట్టణంలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతోన్న వారిలో ఒక వ్యక్తి మృతి చెందారు. స్థానిక విద్యానగర్ కు చెందిన శ్రీధర్(45) ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఒకేసారి అస్వస్థతకు గురికావడానికి వెనకున్న కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈలోపే తొలి మరణం సభవించడంతో ప్రజల్లో భయాందోళన రెట్టింపైంది. కాగా, ఏలూరు పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శ్రీధర్ మృతిపై వివాదం..
నిజానికి ఏలూరు పట్టణంలో గడిచిన వారం రోజులుగా ఫిట్స్, వాంతుల ఫిర్యాదుతో కొన్ని కేసులు వచ్చినా అధికారులు సరైన రీతిలో స్పందించలేదని, శనివారం రాత్రి ఒక్కసారే వందలమంది అస్వస్థతకు గురైనతర్వాతగానీ పరిస్థితితి తీవ్రత బయటపడలేదనే విమర్శలు వినిపిస్తున్నారు. వింత వ్యాధికి బలైన శ్రీధర్ మరణంపై వివాదం రాజుకుంది. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరిన ఆయనకు సరైన వైద్యం అందలేదని, పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ విజయవాడకు తరలించకుండా తాత్సారం చేయడం వల్లే ప్రాణాలు కోల్పోయారని శ్రీధర్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో మిగతా రోగుల పరిస్థితిపై వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు..

ఏలూరులో భయం భయం..
ఏలూరు వ్యాప్తంగా ఆదివారం రాత్రి నాటికి అస్వస్థతకు గురైనవారి సంఖ్య 292కు పెరిగింది. ఆరోగ్య పరిస్థితి తీవ్రతను బట్టి చాలా మందికి ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి వరకు 117 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులో తలెత్తిన పరిస్థితికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, సెల్ కల్చర్ టెస్టుల రిపోర్టులు వస్తేగానీ అసలేం జరిగిందో తెలుస్తుందని మంత్రి అన్నారు. మంత్రులు, వైద్య యంత్రాంగం ఏలూరులోనే మకాం వేయడంతో కొద్దిగా నిదానించిన ప్రజలు.. శ్రీధర్ మరణం తర్వాత ఆందోళనకు లోనయ్యారు. ప్రజలకు భరోసా ఇచ్చి, పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం జగన్ సోమవారం ఏలూరులో పర్యటించనున్నారు. మరోవైపు..
Recommended Video

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..
ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందడంపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని జగన్ సర్కారుకు ఆయన సూచించారు. బాధితులకు అత్యున్నత వైద్యసేవలు అందించాలని, అదే సమయంలో ఏలూరులో పారిశుద్ధ్య, ప్రజారోగ్యం మెరుగుపరచాలన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, ఏలూరులో శ్రీధర్ మృతి ప్రభుత్వ హత్యే అని, బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications