health tips: మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు అడిక్ట్ అయ్యారా? అయితే డేంజర్‌లో చిన్నారుల ఆరోగ్యం!!
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్ లతో ఆడుకుంటున్నారా? ఫోన్లో టకటకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న, ఆటలు ఆడుకుంటున్న పిల్లల్ని చూసి మీరు తెగ ముచ్చట పడుతున్నారా? శుభ్రంగా ఒక దగ్గర కూర్చొని బుద్ధిగా ఫోన్లో ఆడుకుంటున్నారని సంబర పడుతున్నారా? అయితే మీరు ఒక విషయం గుర్తించటం లేదు అని చెబుతున్నారు వైద్యులు. మొబైల్ ఫోన్ లతో పిల్లలు ఆడుకుంటున్నారని సంబర పడొద్దని, దాని వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.

చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగం.. హానికరమైన ధోరణులకు కారణం
నేటి ఆన్‌లైన్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్ ల నుండి దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు అయినా ఈజీగా నేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్ ప్రపంచానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ, పిల్లలలో ఈ ధోరణి పిల్లల అభివృద్ధి పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. తెలిసీ తెలియని వయసులో చిన్నారులు మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారిలో హానికరమైన ధోరణులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

8 నుండి 12 సంవత్సరాల వయసు వారిలోనూ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్
అధ్యయనాల ప్రకారం యుక్తవయసులో ఉన్న వారు రోజుకు 9 గంటలు మొబైల్ ఫోన్లతో గడుపుతుండగా, 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసున్న పిల్లలు దాదాపు ఆరు గంటలు మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావం చాలా దుష్పరిణామాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు వైద్యులు . పిల్లలలో స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల వివరాల్లోకి వెళితే

స్మార్ట్‌ఫోన్ వాడే పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు, డిప్రెషన్
పిల్లలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల, ఫోన్ లోనే తదేకంగా నిమగ్నమై పోవడం వల్ల మిగతా కుటుంబ సభ్యులతో వారు కలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో వారిలో ప్రవర్తనా సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు అధికంగా మొబైల్ ఫోన్లను చిన్నారులు ఉపయోగించడం వారికి ఒక వ్యసనంగా మారుతుందని, మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే మారాం చేస్తారని, పెద్ద ఎత్తున గొడవ చేస్తారని చెబుతున్నారు. ఇక మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించే పిల్లలలో డిప్రెషన్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిద్ర సమస్యలు.. ఊబకాయం సమస్యలు
నిత్యం మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే పిల్లలు సరిగా నిద్ర పోరని, వారు నిద్ర ఆటంకాలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల చిన్నారులకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయిన చిన్నారులు విపరీతంగా బరువు పెరుగుతారని, ఊబకాయులుగా మారతారని, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు.

నాడీవ్యవస్థ సమస్యలు.. తీవ్ర నిర్ణయాలను తీసుకునేలా కోపం
ఇక మొబైల్ ఫోన్ లకు బానిసలుగా మారుతున్న చిన్నారులు సామాజిక అభివృద్ధిలో వెనుకబడి ఉంటారని, వారిలో శ్రద్ధ తగ్గుతుందని, వినికిడి సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. నాడీ వ్యవస్థ యొక్క సమస్యలతో చిన్నారులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్లు ఎక్కువ వినియోగించటం వల్ల చిన్నారుల తక్కువ ఆకలవుతుందని, ఎక్కువ కోపం వస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి మొబైల్ ఫోన్ల వ్యసనం చిన్నారులను ప్రాణాలు తీసుకునే దాకా కూడా తీసుకు వెళుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్నారులను మొబైల్ ఫోన్ ల నుండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications