వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips:10రోజుల్లో బరువు తగ్గాలి అనుకుంటున్నారా? ఇది చదివాక నిర్ణయం మీదే!!

|
Google Oneindia TeluguNews

చాలామంది ఒబేసిటీ తో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గాలని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కఠినమైన ఉపవాసాలు చేస్తూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. కఠినమైన వ్యాయామం చేస్తూ త్వరగా బరువు తగ్గాలని నానా తంటాలు పడుతుంటారు. ఇక ఎక్కడైనా పది రోజుల్లో బరువు తగ్గుతారు అంటే దానిపై విపరీతంగా ఫోకస్ పెట్టి వాళ్లు చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా పది రోజుల్లోనే బరువు తగ్గాలని అనుకోవడం అత్యాశ అని, అంతకు మించి డేంజర్ అని చెబుతున్నారు వైద్యనిపుణులు.

బరువు తగ్గటం కోసం ఎవరేది చెప్తే అది చేస్తున్నారా? అయితే డేంజర్

బరువు తగ్గటం కోసం ఎవరేది చెప్తే అది చేస్తున్నారా? అయితే డేంజర్

ప్రస్తుత కాలంలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎక్కువ మందిని ఒబేసిటీ బాధితులుగా మారుస్తున్నాయి. మొదట్లో ఒబేసిటీ గురించి పట్టించుకోని వారు, తర్వాత కాలక్రమంలో అనేక అనారోగ్య సమస్యలకు లోనవటంతో వాటి నుంచి బయట పడటం కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకుంటున్నారు. ఎంత తొందరగా బరువు తగ్గితే అంత మంచిదని భావించి ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేకపోయినా ఎవరు ఏది చెబితే దానిని ఫాలో చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బరువు తగ్గడం కోసం ఒక్క సారిగా తమ జీవన విధానాన్ని మార్చుకొని వారు చేసే డైటింగ్, వ్యాయామ విధానాలు కొత్తరకం సమస్యలను తీసుకు వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఈ విషయం ఆలోచించాలి

10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఈ విషయం ఆలోచించాలి

కేవలం 10 రోజుల్లో బరువు తగ్గాలని కఠినమైన ఆహార నియమాలు పాటించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం, వ్యాయామం చేయవలసిన దానికంటే ఎక్కువగా చేయడం వంటి పనులు మంచిదికాదని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 10 రోజుల్లో బరువు తగ్గాలి అనే ఆలోచన తప్పని చెబుతున్నారు. దానికి ఒక లాజిక్ ని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. 10 రోజుల్లో బరువు తగ్గాలి అని భావించేవారు.. వారి శరీర బరువు పది రోజుల్లో పెరిగింది కాదనేది గుర్తించాలి. కాబట్టి కేవలం పది రోజుల్లోనే బరువు తగ్గాలి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టి, ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

 బరువు తగ్గాలనుకునే వారు నిరంతరాయంగా చెయ్యాల్సిన పనులు ఇవే

బరువు తగ్గాలనుకునే వారు నిరంతరాయంగా చెయ్యాల్సిన పనులు ఇవే

ఉదయం లేచిన వెంటనే ఓ గంట సేపు వ్యాయామం చేయడం, మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం, మనం తీసుకునే ఆహారం ఎన్ని కేలరీలు ఉంటుందో, మన శరీరానికి ఎంత అవసరమో నిర్ధారించుకుని అంతే ఆహారాన్ని తీసుకోవడం, సమయానికి నిద్ర పోవడం, సమయానుకూలంగా పనిచేయడం, ప్రతిరోజు కనీసం 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్లు తాగడం, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం, కాఫీలు, టీలు, ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోకుండా ఉండటం వంటి అలవాట్లు చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

 దీర్ఘకాలిక ప్రణాళికతో చేస్తే మంచి ఫలితం.. కొద్ది రోజులకే పరిమితం అయితే ఆరోగ్య నాశనం

దీర్ఘకాలిక ప్రణాళికతో చేస్తే మంచి ఫలితం.. కొద్ది రోజులకే పరిమితం అయితే ఆరోగ్య నాశనం

బరువు తగ్గాలనే ఆలోచన కొద్ది రోజులకే పరిమితం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లినప్పుడు ఆరోగ్యకరమైన మార్పు శరీరంలో వస్తుందని, ఖచ్చితంగా బరువు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పది రోజుల్లోనే బరువు తగ్గుతారని ఎవరు ఏది చెబితే అది నమ్మి, ఆ పది రోజుల వరకూ దానిని ఫాలో అయ్యి ఆ తర్వాత మళ్లీ పాత జీవన విధానాన్ని కొనసాగిస్తే ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నారు. సంవత్సరాల తరబడి పెంచిన శరీరాన్ని వారం, పది రోజుల్లో తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదనేది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Want to lose weight in 10 days? It is said that the idea of losing weight in a short period of time is not good, but one should try to lose weight slowly by changing the way of life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X