వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: లవంగం అని లైట్ తీసుకోకండి.. పోషకాలు, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాకే వాడండి!!

|
Google Oneindia TeluguNews

సహజంగా లవంగాలను ఇంట్లో వంట చేసేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ కూరలలో, బిర్యానీ లలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే లవంగాలలో ఉండే పోషకాలు తెలిస్తే లవంగాలను నిజజీవితంలో మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం కచ్చితంగా చేసుకుంటాం. ఇంతకీ లవంగాలలో ఏమేమి పోషకాలు ఉంటాయి? లవంగాలను మనం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం.''

లవంగాలలో ఎన్నో పోషకాలు

లవంగాలలో ఎన్నో పోషకాలు

చాలామంది లవంగాలను సుగంధద్రవ్యాలుగా, కేవలం మసాలాదినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

భోజనం తర్వాత లవంగాలను తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

భోజనం తర్వాత లవంగాలను తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ముఖ్యంగా లవంగాలను కాస్మటిక్స్ తయారు చేయడంలో, ఫార్మాస్యూటికల్స్ లలో, వ్యవసాయ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలా మాత్రమే కాకుండా రోజూ మూడు పూటలా భోజనం తరువాత లవంగాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. భోజనం చేసిన తరువాత లవంగాన్ని తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పని చేస్తుందని, పేగులు శుభ్రపడతాయని చెబుతున్నారు. కడుపులో సూక్ష్మజీవుల నుండి, వివిధ రకాల హాని కలిగించే క్రిముల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుందని అంటున్నారు.

లవంగాలతో దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం నివారణ, క్యాన్సర్ కు లవంగాలు బెస్ట్

లవంగాలతో దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం నివారణ, క్యాన్సర్ కు లవంగాలు బెస్ట్


అంతేకాదు లవంగాలు నిత్యం తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు నివారణ అవుతాయని చెబుతున్నారు. లవంగాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తొలిదశలో ఉంటే నిరోధిస్తాయి అని సూచిస్తున్నారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో కూడా లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి నొప్పులు, వాపులను నివారిస్తాయి అని చెబుతున్నారు. దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే తగ్గుతుందని చెబుతున్నారు.

లవంగాలు అతిగా మాత్రం తీసుకోవద్దు.. దుష్ఫలితాలు

లవంగాలు అతిగా మాత్రం తీసుకోవద్దు.. దుష్ఫలితాలు


లవంగాలు కడుపులో వికారం వంటి ఇబ్బందులను తొలగిస్తాయని, లివర్, చర్మ సమస్యలు తగ్గిస్తాయని చెబుతున్నారు. లవంగాలు కడుపులో అల్సర్స్ ను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి, ఇక లవంగాలు మంచి చేస్తాయని చాలా మండి ఎప్పుడూ నోట్లో లవంగాలను ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికీ అలా నోట్లో లవంగాలు ఉంచుకోవటం మంచిది కాదంటున్నారు. లవంగాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా లవంగాలను తింటే, కొత్తరకం ఆరోగ్య సమస్యలు వచ్చే ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి రోజుకు ఒకటి రెండు లవంగాలను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని, మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని చెబుతున్నారు

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: అంజీరపండ్లలో ఫుల్ పోషకాలు.. తింటే దరిచేరవు డయాబెటిస్, బీపీ వంటి రోగాలు!!health tips: అంజీరపండ్లలో ఫుల్ పోషకాలు.. తింటే దరిచేరవు డయాబెటిస్, బీపీ వంటి రోగాలు!!

English summary
Do not take cloves lightly.. If you know its nutrients and health benefits, you will surely use it daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X