వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: బిజీలో పడి నీళ్ళు తాగటం మరచిపోతున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!!

|
Google Oneindia TeluguNews

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం సరిగ్గా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటుగా నిత్యం మనం తాగే నీళ్ళ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కావాల్సిన నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది. నీళ్ళే కదా అని నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది.

శరీరానికి నీళ్ళ అవసరం... నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం

శరీరానికి నీళ్ళ అవసరం... నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం


నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా ఉండి మనం నీళ్లను తాగడం పైన పెద్దగా శ్రద్ధ పెట్టము. నీళ్లే కదా అంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.. అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మహత్తరమైన శక్తి నీళ్లకు ఉంటుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒంట్లో ఉండే చెడు పదార్థాలు బయటకు పంపించడానికి, శరీరంలోని టాక్సిన్స్ నుంచి మనకు విముక్తి కలిగించడానికి, శరీరంలోని సెల్స్ కు ఆక్సిజన్ ను అందించడానికి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక నీళ్లు సరిగా తీసుకుంటే చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. మన జీవక్రియ సక్రమంగా సాగాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా కూడా నీళ్ల యొక్క అవసరం ఎంతో ఉంటుంది.

నీళ్ళను వివిధ సమయాలలో తాగటం వల్ల లాభాలివే

నీళ్ళను వివిధ సమయాలలో తాగటం వల్ల లాభాలివే

ఉదయం లేవగానే నీళ్లను తాగితే శరీరంలోని అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. ఇక వ్యాయామం చేసిన తర్వాత కొద్దిసేపటికి నీళ్లు తాగడం వల్ల వ్యాయామం వల్ల కలిగిన అలసట నుండి శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది. భోజనానికి అరగంట ముందు నీటిని తాగడం వల్ల, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా నీళ్లు చేస్తుంది. అంతే కాదు నీరసంగా ఉన్నప్పుడు తాగితే మన శరీరానికి తక్షణమే శక్తి వస్తుంది. ఇక అనారోగ్యంతో ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందినట్టు అవుతుంది. ఇక స్నానం చేసే అరగంట ముందు నీళ్లు తాగితే బీపి కంట్రోల్ లో ఉంటుంది.

నీళ్ళను తాగటానికి ఒక విధానం ఉంది.. తెలుసుకోండి

నీళ్ళను తాగటానికి ఒక విధానం ఉంది.. తెలుసుకోండి


ఎవరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కచ్చితంగా శరీరానికి కావలసిన నీటిని తాగాలని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని త్రాగాలని సూచిస్తున్నారు. నీళ్లు తాగేటప్పుడు నిలబడి గబగబా తాగకుండా, కూర్చొని ప్రశాంతంగా తాగాలని సూచిస్తున్నారు. ఆహారం తినే ముందు ఆహారం తిన్న తర్వాత వెంటనే ఎక్కువగా నీటిని తీసుకోకూడదని చెబుతున్నారు. ఓ అరగంట గ్యాప్ తర్వాత నీళ్లను తాగితే మంచిదని సూచిస్తున్నారు. పనిలో పడి మర్చిపోయాము అని నీళ్లను నిర్లక్ష్యం చేయకుండా, ఖచ్చితంగా నీళ్లు తాగాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

తగినంత నీరు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు

తగినంత నీరు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు

శరీరానికి కావలసినంత నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది అని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తలనొప్పి, అలసిపోయినట్టుగా ఉండటం, కళ్ళు తిరగడం వంటి ఇబ్బందులు వస్తాయని, కండరాల నొప్పులు, కాళ్లవాపులు, పొడి దగ్గు వంటి సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ శరీరానికి కావలసిన నీటిని తగినంత తీసుకొని, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: శీతాకాలంలో కొబ్బరినూనెతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే వాడకుండా ఉండరు!!health tips: శీతాకాలంలో కొబ్బరినూనెతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే వాడకుండా ఉండరు!!

English summary
Get busy and forget to drink water? But doctors say that your health is in danger. It is said that you should always drink enough water for your body otherwise you will get health problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X